Telugu Global
National

పాక్‌ ఆర్మీ చీఫ్‌ను ముద్దు కూడా పెట్టుకుంటా " సిద్ధూ

కాంగ్రెస్‌ నేత, పంజాబ్ మంత్రి, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ మరో వివాదంలో చిక్కుకున్నారు. మాజీ క్రికెటర్ ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రమాణస్వీకార కార్యక్రమానికి వెళ్లి ఆ దేశ ఆర్మీ చీఫ్‌ను కౌగిలించుకోవడంతో ఆ మధ్య సిద్ధూ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. తాజాగా పంజాబ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సిద్ధూ…. దక్షిణ భారత దేశం కంటే పాకిస్తాన్‌ తనకు చాలా బెటర్‌ అని వ్యాఖ్యానించారు. దక్షిణ భారత దేశానికి వెళ్తే అక్కడ తాను చాలా రోజులు […]

పాక్‌ ఆర్మీ చీఫ్‌ను ముద్దు కూడా పెట్టుకుంటా  సిద్ధూ
X

కాంగ్రెస్‌ నేత, పంజాబ్ మంత్రి, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ మరో వివాదంలో చిక్కుకున్నారు. మాజీ క్రికెటర్ ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రమాణస్వీకార కార్యక్రమానికి వెళ్లి ఆ దేశ ఆర్మీ చీఫ్‌ను కౌగిలించుకోవడంతో ఆ మధ్య సిద్ధూ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు.

తాజాగా పంజాబ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సిద్ధూ…. దక్షిణ భారత దేశం కంటే పాకిస్తాన్‌ తనకు చాలా బెటర్‌ అని వ్యాఖ్యానించారు.

దక్షిణ భారత దేశానికి వెళ్తే అక్కడ తాను చాలా రోజులు ఉండలేనని వ్యాఖ్యానించారు. దక్షిణ భారత దేశంలోని ప్రజల సంస్కృతి, అలవాట్లు వేరని చెప్పారు. అదే పాకిస్తాన్‌కు వెళ్తే తనకు అక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకొచ్చారు.

‘ఒక వేళ నేను దక్షిణ భారత్‌కి వెళితే అక్కడ ఎక్కువ కాలం ఉండలేను. నాకు వారి భాష అర్థం కాదు. వారి వంటలు నేను తినలేను. కేవలం ఇడ్లీ మాత్రమే తినగలుగుతాను. అంతేగాని సౌత్‌ ఇండియా వారి వంటలను ఎక్కుకాలం తినలేను. వారి అలవాట్లు, సంస్కృతి వేరు. కానీ నేను పాకిస్తాన్‌ వెళితే వారితో సులభంగా కలిసిపోగలను. వారు పంజాబీ, ఆంగ్లం మాట్లాడగలుగుతారు. అందుకే నాకు దక్షిణ భారత్‌ కంటే పాకిస్తాన్‌ వెళ్లడమే ఇష్టం’ అని సిద్ధూ వెల్లడించారు.

అంతటితో ఆగకుండా గతంలో తాను పాక్‌ ఆర్మీ చీఫ్‌ను ఆలింగనం చేసుకోవడాన్ని సమర్ధించుకున్నారు. అలా చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. అది యాదృచ్చికంగా జరిగిన ఘటన అని చెప్పుకొచ్చారు. కౌగిలింతే కాదు అవసరమైతే పాక్‌ ఆర్మీ చీఫ్‌ను ముద్దు కూడా పెట్టుకుంటానని బహిరంగంగానే చెప్పారు కాంగ్రెస్‌ నేత సిద్దూ.

సిద్దూ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దేశంలోని దక్షణాదిని కించపరిచి…. పాకిస్తాన్‌ను మెచ్చుకోవడంపై సిద్దూను పలువురు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. ఇలాంటి వ్యక్తులు ఉంటే దేశం రెండుగా చీలినా ఆశ్చర్యం లేదని వ్యాఖ్యానిస్తున్నారు. సిద్దూ వ్యాఖ్యలపై ఆ పార్టీ పెద్దలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

First Published:  14 Oct 2018 4:15 AM IST
Next Story