వరదల్లో చంద్రబాబు మార్కు ప్రచార రాజకీయం!
ఒకవైపు ఉత్తరాంధ్ర జనాలు వరదలతో ఇబ్బందులు పడుతుంటే చంద్రబాబు నాయుడు మాత్రం ఈ బురదలోనూ తన ప్రచారాన్ని తగ్గించడం లేదు. అంతా తను దగ్గరుండి చూసుకుంటున్నాను అని చంద్రబాబు నాయుడు కలరింగ్ ఇస్తున్నాడు. అయితే చంద్రబాబు నాయుడు అక్కడ ఉండటంతో అధికారులకు అదనపు భారం తప్ప అంతకు మించి ప్రయోజనం ఏమీ లేదని స్పష్టం అవుతోంది. ఈయన కోసం ఏర్పాట్లు చేయడానికే అధికారులకు సరిపోతోంది. ఇక ప్రజల కోసం ఏం చేస్తారు? ఇటీవలే నక్సల్స్ దాడులు జరిగిన […]
ఒకవైపు ఉత్తరాంధ్ర జనాలు వరదలతో ఇబ్బందులు పడుతుంటే చంద్రబాబు నాయుడు మాత్రం ఈ బురదలోనూ తన ప్రచారాన్ని తగ్గించడం లేదు. అంతా తను దగ్గరుండి చూసుకుంటున్నాను అని చంద్రబాబు నాయుడు కలరింగ్ ఇస్తున్నాడు.
అయితే చంద్రబాబు నాయుడు అక్కడ ఉండటంతో అధికారులకు అదనపు భారం తప్ప అంతకు మించి ప్రయోజనం ఏమీ లేదని స్పష్టం అవుతోంది. ఈయన కోసం ఏర్పాట్లు చేయడానికే అధికారులకు సరిపోతోంది. ఇక ప్రజల కోసం ఏం చేస్తారు?
ఇటీవలే నక్సల్స్ దాడులు జరిగిన ప్రాంతాలు కావడంతో బాబును కాపాడుకోవడమే అధికారులకు కష్టం అయిపోతోంది. దీనికి తోడు చినబాబు కూడా రంగంలోకి దిగాడు. ఇలా ఇద్దరికీ బందోబస్తు కల్పించడమే పని అయిపోయింది. ఇక జన సామాన్యం ఇక్కట్లకు అయితే కొదవలేదు.
బాధితులు అనేక మంది మీడియాతో తమ గోడును వెళ్ళబోసుకుంటున్నారు. తీవ్రంగా నష్టపోయామని… కనీస సౌకర్యాల కల్పన కూడా ఇంకా జరగలేదని వారు వాపోతున్నారు. తిండితిప్పలు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇదీ అక్కడి పరిస్థితి.
చంద్రబాబేమో తనే అంతా చక్కదిద్దుతున్నట్టుగా కలరింగ్ ఇస్తుంటే.. సామాన్య ప్రజలు మాత్రం తీవ్రమైన అసహనంతో కనిపిస్తూ ఉన్నారు. సాధారణంగా ఇలాంటి విపత్తుల సమయంలో ముఖ్యమంత్రి అక్కడ ఉండనక్కర్లేదు. రాజధానిలో కూర్చుని పరిస్థితిని సమీక్షించడమే చేయాలి. చంద్రబాబు ఈ పని చేయకపోగా అసలు పనికి అడ్డు తగులుతున్నాడని వార్తలు వస్తున్నాయి.