ఐటీ దాడులు పూర్తయ్యాక సీఎం రమేష్ సంచలన ఆరోపణలు
రాజకీయ కక్ష, భయాందోళన వాతావరణం సృష్టించాలనే ఉద్దేశంతోనే బీజేపీ తనపై ఐటీ దాడులు చేసిందని టీడీపీ రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ పేర్కొన్నారు. ఐటీ దాడులు ముగిశాక ఆదివారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడారు. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ సహా దాదాపు 25 చోట్ల ఐటీ అధికారులు దాడులు చేశారని ఎక్కడా ఏం దొరకలేదని స్పష్టంచేశారు. ఐటీ అధికారులు ఏం దొరకలేదని ఇచ్చిన పత్రాలను మీడియాకు చూపించారు. తన భార్య పేరిట సెర్చ్ వారెంట్ తీసుకొచ్చారని.. తన […]
రాజకీయ కక్ష, భయాందోళన వాతావరణం సృష్టించాలనే ఉద్దేశంతోనే బీజేపీ తనపై ఐటీ దాడులు చేసిందని టీడీపీ రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ పేర్కొన్నారు. ఐటీ దాడులు ముగిశాక ఆదివారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడారు. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ సహా దాదాపు 25 చోట్ల ఐటీ అధికారులు దాడులు చేశారని ఎక్కడా ఏం దొరకలేదని స్పష్టంచేశారు. ఐటీ అధికారులు ఏం దొరకలేదని ఇచ్చిన పత్రాలను మీడియాకు చూపించారు.
తన భార్య పేరిట సెర్చ్ వారెంట్ తీసుకొచ్చారని.. తన కంపెనీ రిత్విక్ లో తన భార్య డైరెక్టర్ కాదని.. ఆమెకు ఎలాంటి షేర్లు లేవని.. ఆమె పేరు మీద వారెంట్ తెచ్చి ఐటీ దాడులు ఎలా చేస్తారని సీఎం రమేష్ ప్రశ్నించారు. తాము ఐటీ రిటర్న్స్ రెగ్యులర్ గా దాఖలు చేశామని…. ఎక్కడా అవకతవకలు లేవని.. అలాంటప్పుడు ఎందుకు రైడ్ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో 5 ఏళ్ల కిందట తాను అద్దెకున్న ఆఫీసుకు కూడా పోయి సోదాలు చేశారని.. బెంగళూరులో కూడా 3 ఏళ్ల కిందట మూసేసిన ఆఫీసుకు పోయారని విమర్శించారు.
ఐటీ అధికారుల సోదాల్లో మొత్తం 3.53 లక్షలు మాత్రమే తమ ఇంట్లో దొరికాయని… అందులో దేవుడి ముడుపులే 2 లక్షల సొమ్ము ఉందని సీఎం రమేష్ స్పష్టం చేశారు. కీలక పత్రాలేవీ దొరకలేదని.. కేవలం మా బ్యాంకు పాస్ బుక్కులు, పాన్ కార్డులు మాత్రమే వారికి దొరికాయన్నారు. మా కంపెనీల్లో మొత్తం వెతికితే కేవలం 70వేలు మాత్రమే దొరికాయన్నారు.
నేను పొందిన కాంట్రాక్టుల గురించి సాక్షి మీడియాలో తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నారని సీఎం రమేష్ మండిపడ్డారు. తాను టెండర్ ప్రక్రియలోనే పొందానని.. కానీ తనపై మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 5 లక్షలకు మించి ఏ పని అయినా టెండర్ ద్వారా చేస్తారన్న జ్ఞానం మీడియాకు లేదా అని ప్రశ్నించారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొండను తవ్వి తన ఇంట్లో ఎలుకను పట్టారని.. అభాసుపాలు చేయడానికే రెండు, మూడు రోజులు నాటకాలాడరని సీఎం రమేష్ మండిపడ్డారు. తాను పార్లమెంట్ పీఏసీగా ఐటీ దాడులపై ప్రశ్నిస్తే తనపై కూడా ఐటీ దాడులు చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమిత్ షా తనను పీఏసీ చైర్మన్ కాకుండా అడ్డుకున్నారని…. తాను వినకపోయి గెలిచేసరికి ఇలా చేయిస్తున్నాడని ఫైర్ అయ్యారు.