Telugu Global
Cinema & Entertainment

నైజాం పరిస్థితేంటి 'అరవింద' ?

ఆంధ్రాలో బ్రేక్ ఈవెన్ అవ్వడం సమస్య కాదు. ఎందుకంటే అక్కడ చాలా ఏరియాల్లో హారిక-హాసిని నిర్మాతలు మ్యూచువల్ గా రిలీజ్ కు ఇచ్చారు. పైగా చంద్రబాబు పుణ్యమా అని ఏపీలో రోజుకు 6 షోలు పడుతున్నాయి. టిక్కెట్ల రేట్లు పెంపు దీనికి అదనం. ఇవన్నీ కలిసొచ్చి అరవిందసమేతను ఏపీలో సేఫ్ వెంచర్ గా మార్చేశాయి. ఎటొచ్చీ నైజాంలోనే ఈ సినిమాకు కష్టాలు నైజాంలో అరవింద సమేత చిత్రాన్ని దిల్ రాజు దక్కించుకున్నారు. ఏకంగా 18 కోట్ల రూపాయలకు […]

నైజాం పరిస్థితేంటి అరవింద ?
X

ఆంధ్రాలో బ్రేక్ ఈవెన్ అవ్వడం సమస్య కాదు. ఎందుకంటే అక్కడ చాలా ఏరియాల్లో హారిక-హాసిని నిర్మాతలు మ్యూచువల్ గా రిలీజ్ కు ఇచ్చారు. పైగా చంద్రబాబు పుణ్యమా అని ఏపీలో రోజుకు 6 షోలు పడుతున్నాయి. టిక్కెట్ల రేట్లు పెంపు దీనికి అదనం. ఇవన్నీ కలిసొచ్చి అరవిందసమేతను ఏపీలో సేఫ్ వెంచర్ గా మార్చేశాయి. ఎటొచ్చీ నైజాంలోనే ఈ సినిమాకు కష్టాలు

నైజాంలో అరవింద సమేత చిత్రాన్ని దిల్ రాజు దక్కించుకున్నారు. ఏకంగా 18 కోట్ల రూపాయలకు కొన్నారు. తెలంగాణలో 3వందల థియేటర్ల వరకు సంపాదించగలిగారు. కానీ 18 కోట్ల బ్రేక్-ఈవెన్ అంటే కనీసం 20 కోట్లు అయినా రావాలి. అలా రావాలంటే మూడొంతలు బిజినెస్ మొదటి రోజే జరగాలి. కానీ అలా జరగలేదు.

అరవింద సమేత చిత్రానికి నైజాంలో మొదటిరోజు 5 కోట్ల 73 లక్షల షేర్ మాత్రమే వచ్చింది. దిల్ రాజు మాత్రం 6.30 కోట్ల నుంచి 7 కోట్లు అంచనా వేశాడు. ఇక రెండో రోజు అంటే శుక్రవారం రోజు ఈ సినిమాకు కేవలం 2 కోట్ల 80 లక్షల రూపాయల షేర్ మాత్రం వచ్చింది. అంటే 2 రోజుల్లో 8 కోట్ల 53 లక్షల రూపాయలన్నమాట.

ఫస్ట్ వీకెండ్ లో (4 రోజులకు) నైజాంలో 13-14 కోట్ల రూపాయలు అంచనా వేశారు. ఎందుకంటే ఆ తర్వాత వద్దన్నా థియేటర్లలో ఆక్యుపెన్సీ పడిపోతుంది. సో.. 2 రోజుల్లో 8 కోట్ల 53 లక్షలు సంపాదించిన ఈ సినిమా.. మిగతా 2 రోజుల్లో అదనంగా మరో 5-6 కోట్లు కలెక్ట్ చేస్తుందా అనేది అందర్లో నెలకొన్న సందేహం.

ప్రస్తుతానికైతే దిల్ రాజు దసరా సీజన్ పైనే ఆశలు పెట్టుకున్నాడు. ఇంటిల్లిపాది ఖాళీగా ఉంటారు కాబట్టి, సినిమాకు వస్తారనేది రాజుగారి ఆశ.

First Published:  13 Oct 2018 3:58 PM IST
Next Story