వివేక్ ఇంట్లో చెన్నూర్ చిచ్చు ! కాంగ్రెస్ గూటికి వినోద్ !
వీ6 చానల్ అధినేత, పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ ఇంట్లో టికెట్ చిచ్చు మొదలైంది. చెన్నూర్ టికెట్ కోసం బ్రదర్స్ వివేక్,వినోద్ మధ్య ఫైట్ మొదలైంది. చెన్నూర్ టికెట్ కోసం వినోద్ పట్టుబడుతున్నారు. ఇప్పటికే రెండు సార్లు కేటీఆర్‌ను కలిశారు. టికెట్ ఇవ్వాలని అడిగారు. బాల్క సుమన్‌ను మార్చేదిలేదని కేటీఆర్ స్పష్టం చేశారు. దీంతో బెల్లంపల్లి లేదా చొప్పదండి లేదా వికారాబాద్ సీటు ఇవ్వాలని కేటీఆర్‌ను కోరారు. అయితే ఈ విషయంలో కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని కేటీఆర్ […]
వీ6 చానల్ అధినేత, పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ ఇంట్లో టికెట్ చిచ్చు మొదలైంది. చెన్నూర్ టికెట్ కోసం బ్రదర్స్ వివేక్,వినోద్ మధ్య ఫైట్ మొదలైంది. చెన్నూర్ టికెట్ కోసం వినోద్ పట్టుబడుతున్నారు. ఇప్పటికే రెండు సార్లు కేటీఆర్‌ను కలిశారు. టికెట్ ఇవ్వాలని అడిగారు. బాల్క సుమన్‌ను మార్చేదిలేదని కేటీఆర్ స్పష్టం చేశారు.
దీంతో బెల్లంపల్లి లేదా చొప్పదండి లేదా వికారాబాద్ సీటు ఇవ్వాలని కేటీఆర్‌ను కోరారు. అయితే ఈ విషయంలో కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని కేటీఆర్ చెప్పారు. దీంతో ఇప్పుడు వివేక్ బ్రదర్స్ ఏం చేయాలనే విషయంలో తర్జనభర్జన పడుతున్నారు.
2004లో వినోద్ చెన్నూరు నుంచి గెలిచారు. వైఎస్ కేబినెట్‌లో మంత్రిగా చేరారు. 2009, 2014లో ఓడిపోయారు. ఆతర్వాత చెన్నూరు రాజకీయాలకు కొంచెం దూరంగా ఉన్నారు. అయితే ఈ ఎన్నికల్లో మళ్లీ పోటీ చేసేందుకు పావులు కదపడం చర్చనీయాంశంగా మారింది.
గత ఎన్నికల ముందు టీఆర్ఎస్‌లో చేరి… ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఈ బ్రదర్స్ ఓడిపోయారు. తర్వాత మళ్లీ టీఆర్ఎస్‌లోకి వెళ్లారు. వివేక్‌కు ప్రభుత్వ సలహాదారు పదవి లభించింది. కానీ వినోద్‌కు మాత్రం ఎలాంటి పదవి రాలేదు. పెద్దపల్లి ఎంపీగా పోటీ చేసేందుకు వివేక్ కు లైన్ క్లియర్ అయింది. బాల్క సుమన్‌ను చెన్నూరుకు పంపించారు. దీంతో అలిగిన వినోద్ టికెట్ కోసం పట్టుబడుతున్నట్లు తెలిసింది.
రాజకీయంగా వివేక్ కన్నా వినోద్ సీనియర్. టీఆర్ఎస్‌లో తనకు ప్రాధాన్యత లేకపోవడంతో ఆయన ప్రత్యామ్నాయాల వైపు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అనుచరులతో సమావేశమయ్యారు. కాంగ్రెస్ టికెట్ ఇస్తే చెన్నూరు నుంచి పోటీకి రెడీ అయినట్లు సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్ స్కీనింగ్ కమిటీ సభ్యురాలు షర్మిష్ట ముఖర్జీని వినోద్ ఢిల్లీలో కలిశారని వార్తలు వస్తున్నాయి.ఈ విషయం తెలిసిన వివేక్ తన ఎంపీ సీటును బాల్క సుమన్‌కు ఇచ్చి….తన అన్న వినోద్‌కు చెన్నూరు సీటు ఇవ్వాలని కోరారని చెబుతున్నారు. చెన్నూరు, బెల్లంపల్లిలో ఏదో ఒక సీటు తనకు ఇవ్వకపోతే తప్పకుండా పార్టీ మారుతానని వినోద్ ఇప్పటికే సన్నిహితుల దగ్గర చెప్పినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌లో వినోద్ చేరతారని ఊహగానాలు మొదలయ్యాయి.