తమిళనాడు ముఖ్యమంత్రి పై సిబీఐ విచారణ
తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి పై సిబీఐ విచారణకు మద్రాసు హైకోర్టు ఆదేశించింది. తమిళనాడులో 3,500 కోట్ల రూపాయల విలువైన కాంట్రాక్టు పనులను ముఖ్యమంత్రి పళని స్వామి తన బినామీలకు, బంధువులకు అప్పగించారని, ఈ కాంట్రాక్టు పనుల్లో చాలా అవినీతి చోటుచేసుకున్నదని హైకోర్టులో డిఎంకే నేత ఒకరు పిటిషన్ వేశారు. దాన్ని స్వీకరించిన న్యాయస్థానం ఈ అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేయాలని డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ అండ్ అంటీ కరప్షన్ సంస్థను ఆదేశించింది. అయితే ఆ సంస్థ […]
తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి పై సిబీఐ విచారణకు మద్రాసు హైకోర్టు ఆదేశించింది.
తమిళనాడులో 3,500 కోట్ల రూపాయల విలువైన కాంట్రాక్టు పనులను ముఖ్యమంత్రి పళని స్వామి తన బినామీలకు, బంధువులకు అప్పగించారని, ఈ కాంట్రాక్టు పనుల్లో చాలా అవినీతి చోటుచేసుకున్నదని హైకోర్టులో డిఎంకే నేత ఒకరు పిటిషన్ వేశారు. దాన్ని స్వీకరించిన న్యాయస్థానం ఈ అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేయాలని డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ అండ్ అంటీ కరప్షన్ సంస్థను ఆదేశించింది.
అయితే ఆ సంస్థ దర్యాప్తు ముఖ్యమంత్రికి అనుకూలంగా నడుస్తోందని పిటిషనర్ చేసిన వాదనతో కోర్టు ఏకీభవించింది. దాంతో తాజాగా సిబీఐ విచారణకు ఆదేశించింది. ప్రాధమిక విచారణ నివేదికను మూడు నెలలలోగా అందజేయాలని సిబీఐని కోరింది.