Telugu Global
Cinema & Entertainment

నాగచైతన్య సినిమా రిలీజ్ కష్టాలు

శైలజారెడ్డి అల్లుడు సినిమాను అక్కినేని కాంపౌండ్ సూపర్ హిట్ అని చెప్పుకుంటోంది. అక్కినేని ఫ్యాన్స్ అయితే భలే ఊదరగొడుతున్నారు. కానీ అసలు విషయం ఏంటనేది డిస్ట్రిబ్యూటర్లకు మాత్రమే తెలుసు. అందుకే సవ్యసాచి సినిమా కొనేందుకు ముందువెనక ఆలోచిస్తున్నారు చాలామంది. అవును.. ఈ సినిమా ప్రీ-రిలీజ్ కష్టాలు తొలిగేలా కనిపించడం లేదు. కేవలం ప్రీ-రిలీజ్ బిజినెస్ కోసమే ఈమధ్య టీజర్ వదిలారు. అది వదిలితే తప్ప ఆంధ్రా బిజినెస్ క్లోజ్ అవ్వలేదు. అటుఇటుగాగ 9 కోట్లకు డీల్ లాక్ […]

నాగచైతన్య సినిమా రిలీజ్ కష్టాలు
X

శైలజారెడ్డి అల్లుడు సినిమాను అక్కినేని కాంపౌండ్ సూపర్ హిట్ అని చెప్పుకుంటోంది. అక్కినేని ఫ్యాన్స్ అయితే భలే ఊదరగొడుతున్నారు. కానీ అసలు విషయం ఏంటనేది డిస్ట్రిబ్యూటర్లకు మాత్రమే తెలుసు. అందుకే సవ్యసాచి సినిమా కొనేందుకు ముందువెనక ఆలోచిస్తున్నారు చాలామంది. అవును.. ఈ సినిమా ప్రీ-రిలీజ్ కష్టాలు తొలిగేలా కనిపించడం లేదు.

కేవలం ప్రీ-రిలీజ్ బిజినెస్ కోసమే ఈమధ్య టీజర్ వదిలారు. అది వదిలితే తప్ప ఆంధ్రా బిజినెస్ క్లోజ్ అవ్వలేదు. అటుఇటుగాగ 9 కోట్లకు డీల్ లాక్ అయింది. నైజాంలో కూడా టీజర్ తర్వాతే ఆరాలు మొదలయ్యాయి. ఇక సీడెడ్ కూడా 2 కోట్ల 40 లక్షలకు అగ్రిమెంట్ ముగిసింది.

సవ్యసాచి ప్రీ-రిలీజ్ ఇంత నత్తనడకన నడుస్తున్నప్పటికీ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు మాత్రం ధీమాగా ఉన్నారు. ఎందుకంటే.. శాటిలైట్, డిజిటల్ స్ట్రీమింగ్, డబ్బింగ్ రైట్స్ ను ఇప్పటికే అమ్మేశారు. అది వీళ్లకు కలిసొచ్చిన అంశం. అందుకే కాస్త రిస్క్ తీసుకొని నైజాంలో సొంత రిలీజ్ కు వెళ్లే ఆలోచలో కూడా ఉన్నారు.

First Published:  13 Oct 2018 3:38 AM IST
Next Story