Telugu Global
NEWS

30 శాతం కార్యకర్తలు వైసీపీలో చేరిపోయారు " టీడీపీ ఎమ్మెల్సీ

అనంతపురం జిల్లా రాయదుర్గం టీడీపీ మూడు ముక్కలైంది. మొన్నటి ఎన్నికల్లో జేసీ అల్లుడు దీపక్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవింద్ రెడ్డిని కాదని కాలువ శ్రీనివాస్‌కు చంద్రబాబు టికెట్ ఇచ్చారు. అయినా సరే పార్టీ నిర్ణయానికి కట్టుబడి దీపక్ రెడ్డి, గోవింద్ రెడ్డి వర్గీయులు కాలువ శ్రీనివాస్ గెలుపుకోసం పని చేశారు. ఆయన గెలిచి ఇప్పుడు మంత్రి అయ్యారు. మంత్రి అయిన తర్వాత నియోజకవర్గంలో ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గోవింద్ రెడ్డి వర్గీయులను […]

30 శాతం కార్యకర్తలు వైసీపీలో చేరిపోయారు  టీడీపీ ఎమ్మెల్సీ
X

అనంతపురం జిల్లా రాయదుర్గం టీడీపీ మూడు ముక్కలైంది. మొన్నటి ఎన్నికల్లో జేసీ అల్లుడు దీపక్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవింద్ రెడ్డిని కాదని కాలువ శ్రీనివాస్‌కు చంద్రబాబు టికెట్ ఇచ్చారు. అయినా సరే పార్టీ నిర్ణయానికి కట్టుబడి దీపక్ రెడ్డి, గోవింద్ రెడ్డి వర్గీయులు కాలువ శ్రీనివాస్ గెలుపుకోసం పని చేశారు.

ఆయన గెలిచి ఇప్పుడు మంత్రి అయ్యారు. మంత్రి అయిన తర్వాత నియోజకవర్గంలో ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గోవింద్ రెడ్డి వర్గీయులను బాగా ఇబ్బందిపెడుతున్నారు. దీపక్ రెడ్డి, గోవింద్ రెడ్డితో సంబంధాలున్న వారికి ఒక్క కాంట్రాక్టు కూడా ఇవ్వకుండా అణచివేస్తున్నారన్నది ఆరోపణ.

పైగా ఇటీవల చంద్రబాబు అనంతపురం జిల్లా పర్యటనకు రాగా ఫ్లెక్సీలపై ఎక్కడా కూడా దీపక్ రెడ్డి ఫొటో ఉండడానికి వీల్లేదని మంత్రి కాలువ శ్రీనివాస్ ఆదేశించారు. దీంతో విభేదాలు బహిర్గతమయ్యాయి. మీడియా సమావేశం ఏర్పాటు చేసిన దీపక్ రెడ్డి మంత్రి కాలువపై నేరుగా ఘాటు విమర్శలు చేశారు.

”నీవు రాజీనామా చేసి రా… నీపై బీసీ అభ్యర్థినే దింపుతా. మా సహకారం లేకుండా గెలిచావనుకో… నీవు గ్రేట్. నేను రాజకీయాలు మానేస్తా ” అంటూ కాలువ శ్రీనివాస్‌కు దీపక్‌ రెడ్డి సవాల్ చేశారు. తన అనుచరగణాన్ని అణచివేయాలని కాలువ చూస్తున్నారని కానీ అలాంటి బెదిరింపులకు తాను భయపడేవాడిని కాదన్నారు. మంత్రికి ఇదే తన చివరి హెచ్చరిక అని, గ్రూపు రాజకీయాలను మానుకోకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు.

చంద్రబాబు పర్యటనలో దీపక్‌ రెడ్డి ఫొటో ఎక్కడా కనిపించకూడదని మంత్రి కాలువ ఆదేశాలు జారీ చేశారని మండిపడ్డారు. తాను టీడీపీకి చెందిన వాడిని కాదని పార్టీ నాయకత్వంతో ఒక్క మాట చెప్పించగలవా? అని సవాల్ చేశారు దీపక్ రెడ్డి. ఇలాంటి చిల్లర రాజకీయాలను చేస్తే తాను కూడా మంత్రి కాలువ చిట్టా విప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు. కాలువ శ్రీనివాస్‌ కారణంగా నియోజకవర్గంలో 30 శాతం మంది టీడీపీ కార్యకర్తలు వైసీపీలో చేరిపోయారని…. ఇది నిజం కాదేమో చెప్పాలని మంత్రిని సవాల్ చేశారు.

First Published:  13 Oct 2018 7:44 AM IST
Next Story