సీఎం రమేష్‌కు వ్యతిరేకంగా ఆలహాబాద్ బ్యాంకు మేనేజర్ సాక్షం
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు బినామీగా భావించే సీఎం రమేష్ ఐటీ దాడులకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. చివరకు ఐటీ అధికారులపైనే ఆయన చిందులు తొక్కుతున్నారు. దాడుల సమయంలో సాక్షులుగా ఎవరిని తీసుకురావాలన్నది కూడా ఆయనే నిర్దేశిస్తున్నారు. దాడుల సమయంలో సాక్షులుగా తెలంగాణ ప్రాంతానికి చెందిన అధికారులను ఐటీ సిబ్బంది తీసుకొచ్చారు. దీనిపై సీఎం రమేష్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తనకు ఫోన్ చేసిన ఐటీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. తెలంగాణ అధికారులను సాక్షులుగా తీసుకొచ్చారని…. అందుకు తాను అంగీకరించబోనని […]
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు బినామీగా భావించే సీఎం రమేష్ ఐటీ దాడులకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. చివరకు ఐటీ అధికారులపైనే ఆయన చిందులు తొక్కుతున్నారు. దాడుల సమయంలో సాక్షులుగా ఎవరిని తీసుకురావాలన్నది కూడా ఆయనే నిర్దేశిస్తున్నారు.
దాడుల సమయంలో సాక్షులుగా తెలంగాణ ప్రాంతానికి చెందిన అధికారులను ఐటీ సిబ్బంది తీసుకొచ్చారు. దీనిపై సీఎం రమేష్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తనకు ఫోన్ చేసిన ఐటీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. తెలంగాణ అధికారులను సాక్షులుగా తీసుకొచ్చారని…. అందుకు తాను అంగీకరించబోనని వాదన పెట్టుకున్నారు.
తెలంగాణ ప్రభుత్వంతో తమకు పడడం లేదని…. కాబట్టి ఆ రాష్ట్ర అధికారులను సాక్షులుగా తాను అంగీకరించబోనన్నారు. 15 నిమిషాల టైం ఇస్తే తానే ఒక తటస్త వ్యక్తిని సాక్షిగా పంపుతానని చెప్పారు. సీఎం రమేష్ ఇలా సాక్షులుగా ఎవరుండాలన్నది కూడా చెప్పడం చూసి ఐటీ అధికారులు ఆశ్చర్యపోయారు. అయితే ఐటీ దాడులకు ముందే అధికారులు పక్కా ఆధారాలను సేకరించారు. ఏపీలో వేల కోట్ల ప్రభుత్వ కాంట్రాక్టులను చేజెక్కించుకున్న సీఎం రమేష్ కంపెనీ… ప్రాజెక్టులకు సంబంధించిన బిల్లులు పాస్ అవగానే బ్యాంకులకు వచ్చి నగదునే తీసుకెళ్తున్నట్టు ఐటీ అధికారులు గుర్తించారు.
ఇలా వేల కోట్ల కాంట్రాక్టుల్లో వచ్చిన డబ్బును నగదు రూపంలో తీసుకెళ్లడం ద్వారా ఆ సొమ్ము రికార్డుల్లోకి చేరకుండా మోసం చేసినట్టు నిర్ధారించుకున్నారు. కాంట్రాక్టు బిల్లులకు సంబంధించిన మొత్తాన్ని నగదు రూపంలోనే రమేష్ కంపెనీ వారు ఎక్కువగా పట్టుకెళ్లేవారని హైదరాబాద్ సాగర్ సొసైటీలోని ఆలహాబాద్ బ్యాంకు అధికారులు ఐటీ అధికారులకు వివరించారు. సీఎం రమేష్ కంపెనీ నగదునే ఎక్కువగా పట్టుకెళ్లిన అంశంలో బ్యాంకు మేనేజర్ నుంచి సాక్షి సంతకాన్ని కూడా ఐటీ అధికారులు తీసుకున్నారు. ఆ తర్వాత ఆ సొమ్ము సంగతి తేల్చేందుకు దాడులు మొదలుపెట్టారు. వేల కోట్ల కాంట్రాక్టుల్లో వచ్చిన డబ్బును నగదు రూపంలో తీసుకెళ్లి ఎక్కడ దాచారన్న దానిపైనా ఆరా తీస్తున్నారు.