Telugu Global
NEWS

సీఎం రమేష్ ఇంట్లో బయటపడ్డ ఫింగర్ ప్రింట్‌ లాకర్లు....

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి బినామీగా భావిస్తున్న సీఎం రమేష్ ఇంట్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.  హైదరాబాద్‌ జూబ్లిహిల్స్‌లోని సీఎం రమేష్ రాజప్రసాదాన్ని చూసి ఐటీ అధికారులు నివ్వెరపోయారు. అత్యంత ఆధునిక టెక్నాలజీతో నిర్మాణం చేశారు. ఇంటిని అణువణువూ పరిశీలించిన ఐటీ అధికారులు చివరకు ఇంట్లో ఫింగర్ ప్రింట్‌ సాయంతో తెరుచుకునే లాకర్లను గుర్తించారు. వాటిని తెరిచేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దీంతో ఢిల్లీలో ఉన్న సీఎం రమేష్‌ను హైదరాబాద్‌కు ఐటీ అధికారులు పిలిపించారు. ఇంటి వద్ద […]

సీఎం రమేష్ ఇంట్లో బయటపడ్డ ఫింగర్  ప్రింట్‌ లాకర్లు....
X

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి బినామీగా భావిస్తున్న సీఎం రమేష్ ఇంట్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌ జూబ్లిహిల్స్‌లోని సీఎం రమేష్ రాజప్రసాదాన్ని చూసి ఐటీ అధికారులు నివ్వెరపోయారు. అత్యంత ఆధునిక టెక్నాలజీతో నిర్మాణం చేశారు.

ఇంటిని అణువణువూ పరిశీలించిన ఐటీ అధికారులు చివరకు ఇంట్లో ఫింగర్ ప్రింట్‌ సాయంతో తెరుచుకునే లాకర్లను గుర్తించారు. వాటిని తెరిచేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దీంతో ఢిల్లీలో ఉన్న సీఎం రమేష్‌ను హైదరాబాద్‌కు ఐటీ అధికారులు పిలిపించారు. ఇంటి వద్ద చుట్టుముట్టిన మీడియాతో మాట్లాడిన సీఎం రమేష్…. ఫింగర్‌ ప్రింట్‌ లాకర్లపై స్పందించారు. ఇంట్లో బట్టలు భద్రపరుచుకునే కప్‌బోర్టుకు ఫింగర్‌ ప్రింట్‌ సిస్టం ఉందని చెప్పారు.

తాను ఉన్నా లేకున్నా పనివాళ్లు తీయకూడదన్న ఉద్దేశంతోనే కప్‌బోర్డుకు ఫింగర్‌ ప్రింట్‌ సిస్టం పెట్టుకున్నానని చెప్పారు. తాను వేలు పెడితేనే అది తెరుచుకుంటుందన్నారు. అయితే బట్టలు పెట్టుకునే విభాగానికి ఫింగర్‌ ప్రింట్‌ ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

అది రహస్య లాకర్లని భావిస్తున్నారు. తన పేరుతో సెర్చ్ వారెంట్‌ లేదని…. తన భార్య పేరుతో కూడా వారెంట్ లేదన్నారు. ప్ర‌జాక్షేత్రంలోనే తాను తేల్చుకుంటానని చెప్పారు. తనకు ఏపీలోనే కాకుండా దేశవ్యాప్తంగా కాంట్రాక్టులు ఉన్నాయన్నారు. ఈ విషయంలో సహకరించిన మీడియాకు సీఎం రమేష్ ధన్యవాదాలు తెలిపారు.

First Published:  13 Oct 2018 4:22 PM IST
Next Story