నెటిజెన్ కు ఘాటుగా రిప్లై ఇచ్చిన సమంతా
అక్కినేని సమంతా మీ టు అంటూ సాగుతున్న ఉద్యమం పై స్పందించిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే సమంతా చేసిన పోస్ట్ చేసిన వాటికి గౌరవ ప్రాధాన్ అనే వ్యక్తీ రిప్లై ఇచ్చాడు. ఆయన సమంతా ని ఉద్దేశిస్తూ ఈరోజు మా అబ్బాయి నన్ను ఓ ప్రశ్న అడిగాడు అంటూ స్టార్ట్ చేసాడు. డాడీ అసలు మీటూ అంటే ఏంటి అని అడిగాడు. అప్పుడు నేను మీటూ అంటే ఆడవారి రిటైర్మెంట్ భీమా పధకం అని చెప్పాను. […]
అక్కినేని సమంతా మీ టు అంటూ సాగుతున్న ఉద్యమం పై స్పందించిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే సమంతా చేసిన పోస్ట్ చేసిన వాటికి గౌరవ ప్రాధాన్ అనే వ్యక్తీ రిప్లై ఇచ్చాడు. ఆయన సమంతా ని ఉద్దేశిస్తూ ఈరోజు మా అబ్బాయి నన్ను ఓ ప్రశ్న అడిగాడు అంటూ స్టార్ట్ చేసాడు.
డాడీ అసలు మీటూ అంటే ఏంటి అని అడిగాడు. అప్పుడు నేను మీటూ అంటే ఆడవారి రిటైర్మెంట్ భీమా పధకం అని చెప్పాను. అప్పుడు మా అబ్బాయి అంటే ఏంటి అని మళ్ళీ ప్రశ్నించాడు. “ఆడవాళ్లు అన్ని విషయాల్లో తలదూరుస్తారు. కెరీర్ ముగిశాక ఈ బీమాను వాడుకుంటారు. అప్పుడు వాళ్ల గురించి విలేకరులు వార్తలు రాస్తుంటారు’’ అని సమాధానం ఇచ్చాను అన్నాడు. ఇది విని వాళ్ళ అబ్బాయి ‘గాడ్ బ్లెస్ ఇండియా” అని అన్నాడు అంటూ మీ టు ఉద్యమాన్ని చులకనగా చూసాడు.
ఈ కామెంట్లపై సీరియస్ అయిన సమంతా. ఆ వ్యక్తితో “అదే ప్రశ్న నీ కూతురు అడిగితే ఏం చెబుతావ్?” అని ఘాటుగా రిప్లై ఇచ్చింది. దీంతో సమంతా కి ఎం సమాధానం చెప్పలేక పరారు అయ్యాడు ఆ వ్యక్తీ.