Telugu Global
National

రామోజీరావుకు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ

సుప్రీం కోర్టులో రామోజీరావుకు చెందిన మార్గదర్శికి ఎదురుదెబ్బ తగిలింది. మార్గదర్శి అక్రమాల విచారణపై స్టే పొడిగించాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టిపారేసింది. క్రిమినల్ ప్రొసిడింగ్స్‌ కింద తమపై చర్యలు తీసుకోవద్దని మార్గదర్శి సంస్థ కోరగా అందుకు సుప్రీం కోర్టు అంగీకరించలేదు. విచారణ జరగకుండా స్టే ఇవ్వబోమని స్పష్టం చేసింది. 2006లోనే మార్గదర్శిపై క్రిమినల్‌ ప్రొసీడింగ్స్ మొదలవగా రామోజీరావు స్టే తెచ్చుకున్నారు. అయితే ఏ క్రిమినల్ కేసులోనైనా స్టే ఆరు నెలలకు మించి ఉండకూడదని ఇటీవల సుప్రీం కోర్టు […]

రామోజీరావుకు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ
X

సుప్రీం కోర్టులో రామోజీరావుకు చెందిన మార్గదర్శికి ఎదురుదెబ్బ తగిలింది. మార్గదర్శి అక్రమాల విచారణపై స్టే పొడిగించాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టిపారేసింది. క్రిమినల్ ప్రొసిడింగ్స్‌ కింద తమపై చర్యలు తీసుకోవద్దని మార్గదర్శి సంస్థ కోరగా అందుకు సుప్రీం కోర్టు అంగీకరించలేదు. విచారణ జరగకుండా స్టే ఇవ్వబోమని స్పష్టం చేసింది.

2006లోనే మార్గదర్శిపై క్రిమినల్‌ ప్రొసీడింగ్స్ మొదలవగా రామోజీరావు స్టే తెచ్చుకున్నారు. అయితే ఏ క్రిమినల్ కేసులోనైనా స్టే ఆరు నెలలకు మించి ఉండకూడదని ఇటీవల సుప్రీం కోర్టు తీర్పుఇచ్చింది. దీంతో మార్గదర్శిపై ఉన్న స్టే అటోమెటిక్‌గా తొలగిపోయింది. తదుపరి క్రిమినల్ ప్రొసీడెంగ్స్‌కు అవకాశం ఏర్పడింది.

ఈ పరిణామం నుంచి తప్పుకునేందుకు మార్గదర్శి సుప్రీం కోర్టుకు వెళ్లింది. కానీ అక్కడ చుక్కెదురైంది. ఈ దశలో విచారణపై స్టే ఇవ్వడం సాధ్యం కాదని చీఫ్ జస్టిస్ రంజన్‌ గోగాయ్‌ ధర్మాసనం స్పష్టం చేశారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వ సమాధానం కోరగా టీ సర్కార్ మరింత గడువు కోరింది.

రామోజీ రావు చేసిన నేరానికి రెండింతల జరిమానాతో పాటు రెండేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పారు.

సుప్రీం కోర్టులో పిటిషన్ వేసిన రామోజీరావు…. కేసు నాంపల్లి కోర్టులో ఉండగా ప్రతివాదిగా ఏపీ ప్రభుత్వాన్ని చేర్చారే గానీ తెలంగాణ ప్రభుత్వాన్ని చేర్చలేదని ఉండవల్లి వివరించారు. కేసులో డిపాజిటర్లకు డబ్బు తిరిగి చెల్లించినా క్రిమినల్ కేసులో విచారణ, శిక్ష మాత్రం తప్పవని వివరించారు.

First Published:  12 Oct 2018 5:30 PM IST
Next Story