లోదుస్తుల్లోకి చేతులు పెట్టాడు.... అక్బర్ కథ కంచికే?
మోడీ మంత్రివర్గంలో సభ్యుడిగా ఉన్న ఎంజే ఆక్బర్ పై తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. దశాబ్దాలుగా పత్రికా రంగంలో పని చేసిన వ్యక్తి అక్బర్. సీనియర్ జర్నలిస్టుగా ప్రతికలకు ఎడిటోరియల్ డైరెక్టర్ గా వ్యవహరించాడీయన. ఆ నేపథ్యంతోనే మోడీకి దగ్గరయ్యాడు. ఈయనకు రాజ్యసభ సభ్యత్వాన్ని ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. కేంద్రమంత్రి పదవిని కూడా ఇచ్చారు. అది కూడా విదేశాంగ సహాయ శాఖ వంటి కీలకమైన పదవిని ఇచ్చారు. బీజేపీలో తక్కువగా ఉండే మైనారిటీ కోటాలో అక్బర్ ఈ […]

మోడీ మంత్రివర్గంలో సభ్యుడిగా ఉన్న ఎంజే ఆక్బర్ పై తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. దశాబ్దాలుగా పత్రికా రంగంలో పని చేసిన వ్యక్తి అక్బర్. సీనియర్ జర్నలిస్టుగా ప్రతికలకు ఎడిటోరియల్ డైరెక్టర్ గా వ్యవహరించాడీయన. ఆ నేపథ్యంతోనే మోడీకి దగ్గరయ్యాడు. ఈయనకు రాజ్యసభ సభ్యత్వాన్ని ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. కేంద్రమంత్రి పదవిని కూడా ఇచ్చారు. అది కూడా విదేశాంగ సహాయ శాఖ వంటి కీలకమైన పదవిని ఇచ్చారు.
బీజేపీలో తక్కువగా ఉండే మైనారిటీ కోటాలో అక్బర్ ఈ పదవిని పొందాడు. ఇక తాజాగా మీ టూ ఉద్యమంలో అక్బర్ పై పది మందికి పైగా మహిళా జర్నలిస్టులు తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. గతంలో అక్బర్ కింద పని చేసిన చాలా మంది ఈ ఆరోపణలు చేస్తున్నారు. అక్బర్ తన లోదుస్తుల్లోకి చేయి పెట్టాడని ఒక మహిళా జర్నలిస్టు ఆరోపించడం గమనార్హం.
అలాగే విదేశీ పర్యటనలకు వెళ్లేటప్పుడు వెంట రమ్మనే వాడని…. డబుల్ మీనింగ్స్ తో మాట్లాడే వాడని, తనకు సహకరించకపోతే తొక్కేసే వాడని…. ఇలా రకరకాలుగా అక్బర్ మీద ఆరోపణలు వస్తున్నాయి. మహిళా జర్నలిస్టులు ఉమ్మడిగా ఈ మంత్రిగారిపై గళమెత్తుతున్నారు.
ప్రస్తుతం అక్బర్ విదేశీ పర్యటనలో ఉన్నాడు. ఈయన తీరుపై వచ్చిన ఆరోపణల గురించి స్పందించడానికి కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ నిరాకరించారు ఇప్పటికే. ఇక ఆరోపణల నేపథ్యంలో అక్బర్ మంత్రి పదవికి రాజీనామా చేయక తప్పదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. విదేశాల నుంచి రాగానే అక్బర్ నుంచి ప్రధాని మోడీ రాజీనామాను కోరవచ్చు అనే కథనాలు వస్తున్నాయి. ఆయన రాజీనామా చేయకపోయినా, మోడీ ఆయనచేత రాజీనామా చేయించకపోయినా ఆర్‌ఎస్‌ఎస్ మాత్రం ఊరుకోదని అంటున్నారు.