సీఎం రమేష్‌కు బాబు కట్టబెట్టిన వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు ఇవే
సీఎంకు అత్యంత సన్నిహితులు, టీడీపీ ఎంపీ సీఎం రమేష్ ఆస్తులపై ఐటీ అధికారులు దాడుల చేస్తున్నారు. ఏపీలో వేల కోట్ల కాంట్రాక్టులు చేస్తూ పన్నులు మాత్రం అతి తక్కువగా చెల్లిస్తుండడంతో ఆయన ఆదాయం నిగ్గు తేల్చేందుకు ఐటీ రంగంలోకి దిగింది. నిజానికి 2014కు ముందు సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ కంపెనీ దివాలా అంచున ఉంది. భాగస్వామ్యులు కూడా మీడియాకెక్కిన సందర్భం ఉంది. అయితే 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే రిత్విక్ సంస్థ విజృంభించింది. సామర్థ్యం లేకున్నా, […]
సీఎంకు అత్యంత సన్నిహితులు, టీడీపీ ఎంపీ సీఎం రమేష్ ఆస్తులపై ఐటీ అధికారులు దాడుల చేస్తున్నారు. ఏపీలో వేల కోట్ల కాంట్రాక్టులు చేస్తూ పన్నులు మాత్రం అతి తక్కువగా చెల్లిస్తుండడంతో ఆయన ఆదాయం నిగ్గు తేల్చేందుకు ఐటీ రంగంలోకి దిగింది. నిజానికి 2014కు ముందు సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ కంపెనీ దివాలా అంచున ఉంది.
భాగస్వామ్యులు కూడా మీడియాకెక్కిన సందర్భం ఉంది. అయితే 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే రిత్విక్ సంస్థ విజృంభించింది. సామర్థ్యం లేకున్నా, నిబంధనలు అడ్డు వచ్చినా సరే వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులను సీఎం రమేష్‌కు బాబుసర్కార్ కట్టబెట్టింది. చివరకు ఏ స్థాయిలో సీఎం రమేష్ కంపెనీకి కాంట్రాక్టులు కట్టబెట్టారంటే… వాటిని చేసే సామర్థ్యం, మెకానిజం కంపెనీ వద్ద లేక చాలా ప్రాజెక్టులు నత్తనడకన సాగుతున్నాయి. అయితే దీన్ని కూడా అవకాశంగా మలచుకున్నారు.
పనులు ఆలస్యం చేయడం ఆ తర్వాత అంచనా వ్యయాన్ని పదేపదే పెంచడం వంటివి రిత్విక్ కంపెనీ విషయంలో తరుచూ జరుగుతూనే ఉన్నాయి. వేల కోట్ల పనులను టెండర్ పిలువకుండానే నామినేషన్ పద్దతిన కట్టబెట్టిన వైనం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇలా వేల కోట్లు ప్రభుత్వం నుంచి వస్తుండడం వల్లే కడప ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఒక్కో ఎంపీటీసీని 20 లక్షలు, ఎంపీపీని రూ. 50 లక్షలు పెట్టి కొనుగోలు చేయడం వెనుక సీఎం రమేష్ హస్తముందన్న ఆరోపణ ఉంది.
సీఎం రమేష్ కంపెనీ వద్ద సబ్ కాంట్రాక్టు తీసుకున్న వారు మాత్రం సర్వనాశనం అవుతారన్న ఆరోపణ ఉంది. సబ్ కాంట్రాక్టర్ పనులు చేసినా డబ్బులు మాత్రం ఏళ్లు తరబడి చెల్లించకుండా తిప్పుతారని వాపోతున్నారు. నాలుగేళ్ల కాలంలో చంద్రబాబు ప్రభుత్వం సీఎం రమేష్ కంపెనీ రిత్విక్‌కు కట్టబెట్టిన కాంట్రాక్టుల్లో కొన్నింటిని పరిశీలిస్తే…
రిత్విక్ కంపెనీకి చంద్రబాబు కట్టబెట్టిన ప్రాజెక్టులు – వాటి వ్యయాలు
కుప్పం బ్రాంచ్ కెనాల్ కాంట్రాక్ట్ – రూ. 522కోట్లు
హంద్రీనీవా ఫేస్-2 – రూ. 1,000 కోట్లు
హంద్రీనీవా విస్తరణ పనులు – రూ. 195 కోట్లు
హంద్రీనీవా 34వ ప్యాకేజ్ – రూ. 234 కోట్లు
గాలేరు నగరి ప్రాజెక్టు – రూ. 350 కోట్లు
వెలిగొండ టన్నెల్ – రూ. 270 కోట్లు
తెలుగు గంగ లైనింగ్ – రూ. 289 కోట్లు
గుంతకల్లు బ్రాంచ్ కెనాల్ – రూ. 172 కోట్లు
వంశధార ప్రాజెక్ట్ పనులు – రూ. 120 కోట్లు
ఆర్టీపీసీ ఆరో ప్లాంట్ – రూ. 400 కోట్లు (అంచనా వ్యయం పెంచి )
గండి కోట ప్రాజెక్టు పునరావాస నిర్మాణం- 106 కోట్లు( 12 శాతం ఎక్సెస్‌తో)
సీఎం రమేష్ దక్కించుకున్న పనుల్లో ఇప్పటి వరకు సకాలంలో పూర్తయిన పని ఒక్కటి కూడా లేదు. కేవలం బిల్లులు తీసుకోవడం, ఆలస్యం చేసి చంద్రబాబు సాయంతో అంచనా వ్యయాలు పెంచడం తరుచూ జరుగుతున్నదే. ఇందుకు అధికారులు మాత్రం లబోదిబోమంటున్నారు.