వైసీపీ ఎంపీల రాజీనామా స్థానాలపై ఈసీ మరోసారి క్లారిటీ
కర్నాటకలో ఖాళీ అయిన లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఈసీ…. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ఎంపీలు రాజీనామా చేయడంతో ఖాళీ అయిన స్థానాలకు ఎన్నికలు ప్రకటించకపోవడం చర్చకు దారి తీసింది. దీనిపై మీడియాలో రకరకాలుగా కథనాలు వచ్చాయి. నారా లోకేష్ మరో అడుగు ముందుకేసి చూశారా… జగన్, మోడీ కుమ్మక్కు అయ్యారు కాబట్టే ఎన్నికలు రాలేదన్నారు. అయితే ఈ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం వివరణ ఇచ్చింది. కర్నాటకలో షెడ్యూల్ ఇచ్చి ఏపీలోని స్థానాలకు ఎన్నికలు […]
కర్నాటకలో ఖాళీ అయిన లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఈసీ…. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ఎంపీలు రాజీనామా చేయడంతో ఖాళీ అయిన స్థానాలకు ఎన్నికలు ప్రకటించకపోవడం చర్చకు దారి తీసింది. దీనిపై మీడియాలో రకరకాలుగా కథనాలు వచ్చాయి.
నారా లోకేష్ మరో అడుగు ముందుకేసి చూశారా… జగన్, మోడీ కుమ్మక్కు అయ్యారు కాబట్టే ఎన్నికలు రాలేదన్నారు. అయితే ఈ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం వివరణ ఇచ్చింది. కర్నాటకలో షెడ్యూల్ ఇచ్చి ఏపీలోని స్థానాలకు ఎన్నికలు నిర్వహించక పోవడంపై క్లారిటీ ఇచ్చింది.
కర్నాటకలో ఉప ఎన్నికలు జరుగుతున్న లోక్‌సభ స్థానాలు మే 18, మే 21నే ఖాళీ అయ్యాయని వివరించింది. ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీల స్థానాలు మాత్రం జూన్ 20న ఖాళీ అయ్యాయని గుర్తు చేసింది. ప్రజాప్రాతినిధ్యం చట్టంలోని సెక్ష న్ 151 ఏ ప్రకారం పదవీ కాలం ఏడాది కంటే ఎక్కువ సమయం ఉన్నప్పుడే ఆరు నెలల్లోగా ఉప ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందని వివరించింది.
వైసీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదం పొందిన జూన్ 20 నాటికి,… 16వ లోక్‌సభ కాలపరిమితి 2019 జూన్ 3కు మధ్య ఏడాది కాలం లేదని అందుకే ఉప ఎన్నికలు నిర్వహించడం లేదని చెప్పింది. కర్నాటకలో మాత్రం మేలోనే లోక్‌సభ స్థానాలు ఖాళీ అయినందున ప్రజాప్రతినిధ్యం చట్టం ప్రకారం ఆరు నెలల్లోనే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.