కూకట్ పల్లి నుంచి రమణ పోటీ చేస్తారా ?
మహాకూటమిలో సీట్ల సర్దుబాటు ప్రక్రియ మొదలైంది. అన్ని పార్టీలు తాము కోరే సీట్ల జాబితాను కాంగ్రెస్ పార్టీకి అందించాయి. ఇక కాంగ్రెస్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఏఏ పార్టీలకు ఎన్ని సీట్లు ఇవ్వాలని అనుకుంటున్నారో నిర్ణయించాల్సి ఉంది. అయితే కూకట్‌పల్లి సీటు కోసం మహాకూటమిలో పోటీ ఉంది. ఈ సీటు కోసం కాంగ్రెస్, టీడీపీ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. చివరకు టీడీపీకే ఈ టికెట్ దక్కే అవకాశాలు కన్పిస్తున్నాయి. కూకట్‌పల్లిలో 4లక్షల 69వేలకు పైగా ఓట్లు […]
మహాకూటమిలో సీట్ల సర్దుబాటు ప్రక్రియ మొదలైంది. అన్ని పార్టీలు తాము కోరే సీట్ల జాబితాను కాంగ్రెస్ పార్టీకి అందించాయి. ఇక కాంగ్రెస్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఏఏ పార్టీలకు ఎన్ని సీట్లు ఇవ్వాలని అనుకుంటున్నారో నిర్ణయించాల్సి ఉంది. అయితే కూకట్‌పల్లి సీటు కోసం మహాకూటమిలో పోటీ ఉంది. ఈ సీటు కోసం కాంగ్రెస్, టీడీపీ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. చివరకు టీడీపీకే ఈ టికెట్ దక్కే అవకాశాలు కన్పిస్తున్నాయి.
కూకట్‌పల్లిలో 4లక్షల 69వేలకు పైగా ఓట్లు ఉన్నాయి. అయితే 2లక్షల30 వేలకు పైగా పోల్ అవుతున్నాయి.
గత ఎన్నికల్లో తెలుగుదేశం నుంచి మాధవరం కృష్ణా రావు పోటీ చేశారు. 99874 ఓట్లు సాధించి గెలిచారు. అయితే కృష్ణారావు టీఆర్ఎస్ లోని వెళ్లిపోవడం.. ఈ ముందస్తు ఎన్నికల్లో ఈ సీటు ఇప్పటివరకూ తెలుగుదేశంకే దక్కుతుందనుకున్నారు. మహాకూటమిగా ఏర్పడినా ఈ సీటు తెలుగుదేశానికే కేటాయిస్తారనుకున్నారు.
అందుకే టీడీపీ నుంచి సీనియర్లు సైతం ఇక్కడ సీటిస్తే పోటీకి రెడీ అన్నారు. టీడీపీ సీనియర్ పెద్ది రెడ్డి కూడా ఇక్కడ పోటీ చేయమంటే ఓకే అన్నారు. ఆ పార్టీలోని మందాడి శ్రీనివాస రావు సైతం తనకు సీటివ్వాలనే డిమాండ్ వినిపిస్తున్నారు.
టీఆర్ఎస్ కార్పొరేటర్ భర్త హరీశ్వర్ రెడ్డి సైతం.. తెలుగుదేశం టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆయన చంద్రబాబుని అమరావతిలో కలిశారు. మరోవైపు తెలుగుదేశం మహిళా నేత అనూష కూడా కూకట్‌పల్లి టికెట్ కోసం ట్రై చేస్తున్నారు.
వీరంతా ఇలా ట్రై చేస్తుంటే…. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ కూకట్‌పల్లి నుంచి పోటీ చేస్తారనే ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. తనసొంత నియోజకవర్గం జగిత్యాల సీటును ఆయన కాంగ్రెస్‌కే వదిలేస్తున్నారు. అక్కడ జీవన్‌రెడ్డి పోటీ చేయడం ఖాయమైంది. రమణను కోరుట్ల నుంచి పోటీ చేయమని అడుగుతున్నారు. ఆ సీటు ఆయనకు ఇష్టం లేదు. దీంతో గ్రేటర్‌లోని కూకట్‌పల్లి నుంచి పోటీ చేయమని ఆయన్ని ఫోర్స్ చేస్తున్నారట. మరీ రమణ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.