Telugu Global
NEWS

ఏపీ డిప్యూటీ సీఎం కుమారుడి తక్షణ అరెస్ట్‌కు కోర్టు ఆదేశం

పత్తికొండ వైసీపీ ఇన్‌చార్జ్‌గా పనిచేసిన చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసు డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కుమారుడు శ్యాంబాబును వెంటాడుతోంది. శ్యాంబాబు ఇసుక దందాకు అడ్డుపడుతున్నారన్న ఉద్దేశంతోనే నారాయణరెడ్డిని హత్య చేసినట్టు ప్రధాన ఆరోపణ. ఈ హత్యకు అప్పటి ఎస్‌ఐ తులసీ నాగప్రసాద్‌ అన్ని విధాలుగా సహకరించారన్నది అందరూ చెబుతున్న మాటే. అయితే పోలీసులు మాత్రం కేఈ శ్యాంబాబును, ఎస్‌ఐ తులసీ నాగప్రసాద్‌ను తప్పించి ఇతరులను అరెస్ట్ చేశారు. కేఈ శ్యాంబాబుకు, ఎస్‌ఐకు కూడా హత్యలో ప్రమేయం […]

ఏపీ డిప్యూటీ సీఎం కుమారుడి తక్షణ అరెస్ట్‌కు కోర్టు ఆదేశం
X

పత్తికొండ వైసీపీ ఇన్‌చార్జ్‌గా పనిచేసిన చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసు డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కుమారుడు శ్యాంబాబును వెంటాడుతోంది. శ్యాంబాబు ఇసుక దందాకు అడ్డుపడుతున్నారన్న ఉద్దేశంతోనే నారాయణరెడ్డిని హత్య చేసినట్టు ప్రధాన ఆరోపణ.

ఈ హత్యకు అప్పటి ఎస్‌ఐ తులసీ నాగప్రసాద్‌ అన్ని విధాలుగా సహకరించారన్నది అందరూ చెబుతున్న మాటే. అయితే పోలీసులు మాత్రం కేఈ శ్యాంబాబును, ఎస్‌ఐ తులసీ నాగప్రసాద్‌ను తప్పించి ఇతరులను అరెస్ట్ చేశారు. కేఈ శ్యాంబాబుకు, ఎస్‌ఐకు కూడా హత్యలో ప్రమేయం ఉందని, వారిని కూడా నిందితుల జాబితాలో చేర్చాలంటూ నారాయణరెడ్డి భార్య శ్రీదేవి డోన్‌ కోర్టులో పిటిషన్‌ వేశారు. దాంతో వారిని కూడా నిందితులుగా చేర్చి అరెస్ట్ చేయాలని డోన్‌ కోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసింది.

కానీ శ్యాంబాబు, ఎస్‌ఐ హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. హైకోర్టు విధించిన స్టే గడువు ముగియడంతో మరోసారి డోన్ కోర్టు స్పందించింది. శ్యాంబాబును, ఎస్‌ఐ తులసీ నాగప్రసాద్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశించింది. ఒకవేళ కోర్టు ఆదేశాలను పోలీసులు పాటించకపోతే తాము పోరాటం కొనసాగిస్తామని శ్రీదేవి తరపు న్యాయవాది సుధాకర్ రెడ్డి స్పష్టం చేశారు.

First Published:  9 Oct 2018 9:24 AM IST
Next Story