Telugu Global
NEWS

ఒక్క కాపు వాడి మీద చెయ్యేసి చూడరా.... మేం కన్నెర్ర చేస్తే ఏపీ వణుకుతుంది....

టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై నటుడు, జనసేన నాయకుడు జీవీ సుధాకర్‌ నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అన్ని కులాల వారిపైనా చింతమనేని చేయి చేసుకున్నారని దమ్ముంటే ఒక కాపు వాడిపై చేయి చేసుకోవాలని సవాల్ చేశారు. ”తమ్ముడూ చింతమనేని ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు, వెళ్లేటప్పుడు దారిలో రంగా గారి గుడి వద్ద చెప్పులు విడిచి దండం పెట్టుకుని వెళ్లరా అప్పుడైనా నీకు బుద్ధి వస్తుంది” అని వ్యాఖ్యానించారు. నీ చేతిలో నలుగుతున్న, నలిగిపోయిన వారికి […]

ఒక్క కాపు వాడి మీద చెయ్యేసి చూడరా.... మేం కన్నెర్ర చేస్తే ఏపీ వణుకుతుంది....
X

టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై నటుడు, జనసేన నాయకుడు జీవీ సుధాకర్‌ నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అన్ని కులాల వారిపైనా చింతమనేని చేయి చేసుకున్నారని దమ్ముంటే ఒక కాపు వాడిపై చేయి చేసుకోవాలని సవాల్ చేశారు.

”తమ్ముడూ చింతమనేని ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు, వెళ్లేటప్పుడు దారిలో రంగా గారి గుడి వద్ద చెప్పులు విడిచి దండం పెట్టుకుని వెళ్లరా అప్పుడైనా నీకు బుద్ధి వస్తుంది” అని వ్యాఖ్యానించారు.

నీ చేతిలో నలుగుతున్న, నలిగిపోయిన వారికి అండగా ఉండేందుకు దెందులూరులో కూడా రంగా గుడి కట్టిస్తామని…. దమ్ముంటే ఒక్క కాపోడి మీద చేయి వేసి చూపించరా అని సవాల్ చేశారు. చింతమనేని కన్నెర్ర చేస్తే అతడి పీఏ వణుకుతాడేమో గానీ తాము కన్నెర్ర చేస్తే ఏపీ మొత్తం వణుకుతుందన్నారు.

రౌడీ షీటర్‌ను ఎమ్మెల్యేను చేసి అసెంబ్లీకి పంపడమే కాకుండా…. వాడిని విప్‌ ను కూడా చేస్తారా? అని జీవీ సుధాకర్ నాయుడు ప్రశ్నించారు. గత ఎన్నికల్లో 600 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారన్నారు. కానీ ఏ హామీ కూడా నెరవేర్చలేదన్నారు. అలా మోసపోయిన వారి కోసమే అండగా జనసేన వచ్చిందని చెప్పారు.

First Published:  9 Oct 2018 10:38 AM IST
Next Story