నవ్విపోదురుగాక యనమల కేంటి..!
ప్రధానమంత్రి విదేశీ పర్యటనల విషయంలో తెలుగుదేశం పార్టీ మరోసారి ఫైర్ అయ్యింది. మోడీ వ్యర్థమైన యాత్రలను చేస్తున్నాడని తెలుగుదేశం మండి పడింది. తన విదేశీ పర్యటనలతో మోడీ కొంత విమర్శల పాలైన సంగతి తెలిసిందే. అయితే మోడీ విదేశీ పర్యటనలు చేపట్టి వివిధ దేశాలతో సంబంధాలు మెరుగుపరుస్తున్నాడని బీజేపీ అంటోంది. విమర్శించే వాళ్లు విమర్శిస్తున్నారు. వేరే ఎవరైనా విమర్శిస్తే అదో లెక్క కానీ…. ఈ విషయంలో మోడీని తెలుగుదేశం పార్టీ విమర్శిస్తూ ఉండటమే పెద్ద విడ్డూరం. అదెందుకో […]
ప్రధానమంత్రి విదేశీ పర్యటనల విషయంలో తెలుగుదేశం పార్టీ మరోసారి ఫైర్ అయ్యింది. మోడీ వ్యర్థమైన యాత్రలను చేస్తున్నాడని తెలుగుదేశం మండి పడింది. తన విదేశీ పర్యటనలతో మోడీ కొంత విమర్శల పాలైన సంగతి తెలిసిందే. అయితే మోడీ విదేశీ పర్యటనలు చేపట్టి వివిధ దేశాలతో సంబంధాలు మెరుగుపరుస్తున్నాడని బీజేపీ అంటోంది. విమర్శించే వాళ్లు విమర్శిస్తున్నారు.
వేరే ఎవరైనా విమర్శిస్తే అదో లెక్క కానీ…. ఈ విషయంలో మోడీని తెలుగుదేశం పార్టీ విమర్శిస్తూ ఉండటమే పెద్ద విడ్డూరం. అదెందుకో చెప్పనక్కర్లేదు. విదేశీ పర్యటనల విషయంలో తెలుగుదేశం పార్టీ ట్రాక్ రికార్డు చాలానే ఉంది. అందుకు గత నాలుగేళ్ల పాలనే నిదర్శనం.
గత నాలుగేళ్లలో ప్రజల సొమ్ముతో విదేశీ పర్యటనలు చేపట్టని టీడీపీ నేతలు ఎవరైనా ఉన్నారా? అనేది ఆలోచించాల్సిన విషయం.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు దగ్గర నుంచి…. ప్రతి ఒక్కరూ విదేశీ యాత్రలు చేసిన వాళ్లే. అది వాళ్ల పర్సనల్ డబ్బుతో కాదు.. ప్రభుత్వ సొమ్ముతో, అంటే ప్రజల సొమ్ముతో. గత పక్షం రోజుల్లో కూడా అటు చంద్రబాబు, ఇటు లోకేష్ చెరో దేశం తిరిగి వచ్చారు.
ఇక చంద్రబాబు కేబినెట్లోని మంత్రులు కూడా బోలెడన్ని యాత్రలు చేశారు. ఈ యాత్రల్లో ఆర్థిక మంత్రి యనమలది మరింత ప్రత్యేక యాత్ర. తన పన్ను పోటుకు చికిత్స కోసం యనమల సింగపూర్ వెళ్లొచ్చాడు. ఆ ఖర్చును ఖజానా నుంచి తీసుకున్నాడు. తీవ్ర విమర్శలు రావడంతో వెనక్కు తగ్గాడు.
ఇప్పుడు యనమల మీడియా ముందుకు వచ్చి విదేశీ పర్యటనల విషయంలో మోడీని విమర్శించడం విడ్డూరంగా ఉంది. మోడీ ఈ దేశానికి ప్రధాని. చంద్రబాబు జానా బెత్తెడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి. చంద్రబాబు కదిలితే ప్రత్యేక విమానాల్లో విదేశీ పర్యటనలు. రోజూ షికారుకు వెళ్ళినట్లుగా జిల్లాల పర్యటనలు. 30 కిలోమీటర్ల దూరానికి కూడా ప్రత్యేక హెలికాప్టర్‌లలో వెళ్ళే చంద్రబాబు, ఆయన మంత్రులు కూడా మోడీని విమర్శిస్తుంటే…. గురివింద సామెత గుర్తుకొస్తోంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
అడ్డగోలుగా ప్రజల సొమ్ముతో విదేశాలు తిరిగిన టీడీపీకి ఈ విషయంలో మాట్లాడే అర్హత అయినా ఉంటుందా?