Telugu Global
NEWS

అప్పుడు ప్రభుత్వం మోసం చేసింది.... ఇప్పుడు రాంగోపాల్‌ వర్మ మోసం చేశాడు

వీరప్పన్ పేరు చెబితే కొన్ని దశాబ్ధాల పాటు కర్నాటక, తమిళనాడు ప్రభుత్వాలే వణికిపోయాయి. సత్యమంగళం అడవుల్లో ఉంటూ ప్రభుత్వాలకు నిద్రలేకుండా చేశాడు.. ఇతడిని పట్టుకోవడం కోసం రెండు రాష్ట్ర ప్రభుత్వాల పోలీసులు ఎన్నో ఆపరేషన్లు నిర్వహించారు. కానీ ఆ ప్రయత్నాల్లో పోలీసులే ఎక్కువగా నష్టపోయారు. 2004లో కె. విజయ్‌ కుమార్‌ నేతృత్వంలో ఎస్‌టీఎఫ్‌ పోలీసులు వీరప్పన్‌ను ఎన్‌కౌంటర్ చేశారు. అయితే ఈ ఎన్‌కౌంటర్‌ వెనుక కీలకమైన వ్యక్తి షుణ్ముగప్రియ. కొయంబత్తూరుకు చెందిన ఈమె తన ప్రాణాలనే పణంగా […]

అప్పుడు ప్రభుత్వం మోసం చేసింది.... ఇప్పుడు రాంగోపాల్‌ వర్మ మోసం చేశాడు
X

వీరప్పన్ పేరు చెబితే కొన్ని దశాబ్ధాల పాటు కర్నాటక, తమిళనాడు ప్రభుత్వాలే వణికిపోయాయి. సత్యమంగళం అడవుల్లో ఉంటూ ప్రభుత్వాలకు నిద్రలేకుండా చేశాడు.. ఇతడిని పట్టుకోవడం కోసం రెండు రాష్ట్ర ప్రభుత్వాల పోలీసులు ఎన్నో ఆపరేషన్లు నిర్వహించారు. కానీ ఆ ప్రయత్నాల్లో పోలీసులే ఎక్కువగా నష్టపోయారు.

2004లో కె. విజయ్‌ కుమార్‌ నేతృత్వంలో ఎస్‌టీఎఫ్‌ పోలీసులు వీరప్పన్‌ను ఎన్‌కౌంటర్ చేశారు. అయితే ఈ ఎన్‌కౌంటర్‌ వెనుక కీలకమైన వ్యక్తి షుణ్ముగప్రియ. కొయంబత్తూరుకు చెందిన ఈమె తన ప్రాణాలనే పణంగా పెట్టి వీరప్పన్‌కు సంబంధించిన వివరాలు సేకరించి ఎస్‌టీఎఫ్‌కు చేరవేసింది. వీరప్పన్‌ భార్య ముత్తులక్ష్మీతో స్నేహం చేసి నాలుగు నెలల్లోనే వీరప్పన్ గుట్టు మొత్తం కనిపెట్టింది. వీరప్పన్ అడవిలో ఎక్కడ దాక్కున్నది, అతడి ఆరోగ్యం దెబ్బతిన్నది, కంటిచూపు సరిగా లేదన్న విషయాలన్నీ ముత్తులక్ష్మీ నుంచి రాబట్టి ఎస్‌టీఎఫ్‌కు చేరవేసింది.

షణ్ముగప్రియ

అలా షణ్ముగప్రియ ఇచ్చిన పక్కా సమాచారంతోనే వీరప్పన్‌ను ఎస్‌టీఎఫ్‌ మట్టుపెట్టింది. షణ్ముగప్రియకు 5కోట్ల రివార్డును ప్రకటించారు. ఇంటి స్థలంతో పాటు ఇతర సదుపాయాలు కల్పిస్తాయని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటికీ ఆమెకు పైసా అందలేదు. 14 ఏళ్లు గడుస్తున్నా తనకు రివార్డు అందలేదని ఆమె వాపోతున్నారు.

ముత్తు లక్ష్మీ

ఇప్పటికీ తనకు వీరప్పన్ భార్య ముత్తు లక్ష్మీ నుంచి ప్రాణహాని ఉందని చెబుతున్నారామె. ప్రధానికి లేఖ రాయగా…. పీఎంవో తిరిగి తమిళనాడు ప్రభుత్వానికి సిఫార్పు చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటికీ స్పందించడం లేదు. ఆమెకు రివార్డు అందజేసే అంశంలో అనేక అడ్డంకులు ఉన్నాయని కాబట్టి తాము స్పష్టమైన హామీ ఇవ్వలేమని తమిళనాడు డీజీపీ చెబుతున్నారు. తనను ప్రభుత్వమే కాదు…. దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా మోసం చేశారని షణ్ముగప్రియ చెబుతున్నారు.

కిల్లర్ వీరప్పన్‌ సినిమా సమయంలో వర్మ తనను సంప్రదించారని వీరప్పన్‌కు సంబంధించిన వివరాలన్నీ ఇస్తే భారీగా డబ్బు ఇస్తామని అగ్రిమెంట్ చేసుకున్నాడని వివరించారు. అడ్వాన్స్‌గా లక్ష రూపాయలు ఇచ్చిన వర్మ ఆ తర్వాత పత్తా లేరని ఆమె చెబుతున్నారు.

First Published:  8 Oct 2018 1:13 AM GMT
Next Story