గులాబీ బాస్ 'ప్లాన్ బి'.... బీజేపీ రెడ్లకు కేసీఆర్ టిక్కెట్లు?
ఎన్నికల్లో ఎత్తుగడలు కామన్. ప్రత్యర్థి రాజకీయ పార్టీలను దెబ్బతీయాలంటే వ్యూహాత్మకంగా ముందుకు పోవాలి. ఎన్నికల యుద్ధంలో ”ప్లాన్ ఏ” వర్క్ అవుట్ కాకపోతే…. ”ప్లాన్ బీ” సిద్ధంగా ఉంచుకోవాలి. లేకపోతే ”ప్లాన్ సీ” ని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే మూడ్‌లో సీఎం కేసీఆర్ ఉన్నారు. 105 మంది అభ్యర్థులను ప్రకటించారు. దాదాపు 20 నుంచి 30 మంది అభ్యర్థులపై తీవ్ర వ్యతిరేకత ఉందని తెలిసి కూడా కేసీఆర్ సాహసం చేశారు. ఎన్నికల టైమ్ నాటికి వాళ్లపై […]
ఎన్నికల్లో ఎత్తుగడలు కామన్. ప్రత్యర్థి రాజకీయ పార్టీలను దెబ్బతీయాలంటే వ్యూహాత్మకంగా ముందుకు పోవాలి. ఎన్నికల యుద్ధంలో ”ప్లాన్ ఏ” వర్క్ అవుట్ కాకపోతే…. ”ప్లాన్ బీ” సిద్ధంగా ఉంచుకోవాలి. లేకపోతే ”ప్లాన్ సీ” ని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే మూడ్‌లో సీఎం కేసీఆర్ ఉన్నారు.
105 మంది అభ్యర్థులను ప్రకటించారు. దాదాపు 20 నుంచి 30 మంది అభ్యర్థులపై తీవ్ర వ్యతిరేకత ఉందని తెలిసి కూడా కేసీఆర్ సాహసం చేశారు. ఎన్నికల టైమ్ నాటికి వాళ్లపై వ్యతిరేకత తగ్గి…. కేసీఆర్‌ను చూసి ఓటేస్తారని భావించారు. కానీ పరిస్థితి చూస్తే మాత్రం రివర్స్ కొడుతోంది. ఒక్క అభ్యర్థిని మార్చినా… మిగతా సీట్లలో కూడా మార్చాల్సి వస్తుంది. దీంతో ఆ తేనెతుట్టెను కదిపే పరిస్థితిలో ఇప్పుడు కేసీఆర్ లేరు.
అభ్యర్థులను మార్చే పరిస్థితి లేదు. ఏం చేయాలి? అందుకే బీజేపీ భుజాలపై తుపాకి పెట్టి కాంగ్రెస్‌ను టార్గెట్ చేయాలని కేసీఆర్ ప్లాన్ చేశారు. ఇప్పటికే బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ఓ క్లారిటీ ఇచ్చారు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే బీజేపీ జాబితా విడుదల చేస్తామని ప్రకటించారు. నామినేషన్ల చివరి రోజులోగా తమ పార్టీలోకి కొత్తగా వచ్చే బలమైన నేతలకు టికెట్లు ఇస్తామని ఆశచూపారు.
ఇదీ ఓ రకంగా గులాబీ రెబెల్స్‌కు కమలం పంపిన ఆహ్వానం. కేసీఆరే పథకం ప్రకారం గెలిచే రెబెల్స్ క్యాండేట్లను బీజేపీలోకి పంపిస్తారనేది వినిపిస్తున్న మాట. ఈ మేరకు కమలంతో కుదిరిన ఒప్పందం ప్రకారం ఈ వ్యూహాం నడుస్తోంది. బీజేపీలో ఎంత మంది రెబెల్స్ తనవారు గెలిచినా వారితో ఎన్నికల తర్వాత పొత్తు పెట్టుకుని ముందుకు సాగవచ్చనేది కేసీఆర్ ప్లాన్. ఇది ”ప్లాన్ ఏ”.
ఇక ”ప్లాన్ బీ” చూస్తే…. కాంగ్రెస్ జాబితా విడుదల కాగానే అక్కడి రెబెల్స్‌కు వల వేస్తారు. వారిని కమలం పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. వారికి ఆర్థికంగా తోడ్పాటును కూడా అందిస్తారు. కాంగ్రెస్‌లో ముఖ్యంగా రెడ్డి అభ్యర్థులు బలంగా ఉన్న చోట మరో బలమైన రెడ్డి క్యాండిడేట్‌ను బీజేపీ తరపున నిలబెట్టాలనేది కేసీఆర్ ప్లాన్. దీని ద్వారా తమ విజయం సులువు అవుతుందని ఆయన భావిస్తున్నారు. ఈ ఫార్ములా వర్కవుట్ కాకపోయినా రెబెల్ రెడ్డి అభ్యర్థి గెలిస్తే బీజేపీ తరపునే గెలుస్తాడు. తమ గూటికే చివరకు చేరుతాడు.
మరోవైపు ”ప్లాన్ సీ” చూస్తే…. మహాకూటమిలో సీపీఐ, తెలంగాణ జనసమితికి ఇచ్చిన సీట్లలో అసంతృప్త కాంగ్రెస్ నేతలకు వల వేయడం ఓ కార్యక్రమం. వీలైతే వారిని పార్టీలోకి లాగాలి. లేకపోతే వేరే మార్గాలను ఉపయోగించి వారిని సైలెంట్ చేయాలి. దీని ద్వారా వీరికి ఇచ్చిన పదో పన్నెండు సీట్లను తమ ఖాతాలోకి వేసుకోవాలి.
ఇలా మూడు విధాలుగా కేసీఆర్ బలమైన స్కెచ్‌లు గీశారు. ఒక్కసారి మహాకూటమి సీట్ల లెక్కలు తేలిన తర్వాత ఈ ప్లాన్ వర్కవుట్ చేయాలని ఆలోచిస్తున్నారట కేసీఆర్.
- @UttamTPCC#DignityOfLabour#IamADishWasherBJPCONgressHarish RaoK KavithaK T Rama RaoK.Chandrashekar RaoKalvakuntla Chandrashekar RaoKalvakuntla KavithaKalvakuntla Taraka Rama RaoKCRkcr plan bkcr telangana formation daykcr telangana protestKTRKTRama Raoplan BShobha RaoT Harish RaoTDPtelangana formation daytelangana protestTelangana Rashtra SamithiThanneeru Harish RaoTHRTRS