ఓటర్ల జాబితాపై హైకోర్టు తీర్పు.... బుధవారానికి వాయిదా
తెలంగాణ ముందస్తు ఎన్నికలకు సర్వం సిద్ధం చేసిన వేళ…. హైకోర్టులో ఓటర్ల జాబితా తప్పుల తడక అనే పిటీషన్ అన్ని రాజకీయ పక్షాలను కలవరపెడుతోంది. ముఖ్యంగా టీఆర్ఎస్ ను, ఎన్నికల కమిషన్ ను అయోమయానికి గురిచేస్తోంది. తెలంగాణ ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని హైకోర్టులో పిటీషన్ దాఖలైన సంగతి తెలిసిందే. ఈ ఓటర్ల జాబితాను తమకు చూపించిన తర్వాతే విడుదల చేయాలని హైకోర్టు స్టే ఇచ్చింది. దీనిపై సోమవారం ఉదయం విచారణ ప్రారంభమైంది. పిటిషనర్ తరఫున న్యాయవాది […]

తెలంగాణ ముందస్తు ఎన్నికలకు సర్వం సిద్ధం చేసిన వేళ…. హైకోర్టులో ఓటర్ల జాబితా తప్పుల తడక అనే పిటీషన్ అన్ని రాజకీయ పక్షాలను కలవరపెడుతోంది. ముఖ్యంగా టీఆర్ఎస్ ను, ఎన్నికల కమిషన్ ను అయోమయానికి గురిచేస్తోంది.
తెలంగాణ ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని హైకోర్టులో పిటీషన్ దాఖలైన సంగతి తెలిసిందే. ఈ ఓటర్ల జాబితాను తమకు చూపించిన తర్వాతే విడుదల చేయాలని హైకోర్టు స్టే ఇచ్చింది. దీనిపై సోమవారం ఉదయం విచారణ ప్రారంభమైంది. పిటిషనర్ తరఫున న్యాయవాది జంధ్యాల రవిశంకర్ వాదనలు వినిపించారు.
ఇక హైకోర్టు కోరినట్టు తెలంగాణలో కొత్తగా నమోదైన ఓటర్లు, పాత ఓటర్ల జాబితాను సవరించిన ఎన్నికల కమిషన్ హైకోర్టులో ఈరోజు తుదిజాబితాను సమర్పించింది. దీంతో తాజాగా ఉదయం 11 గంటలకు విచారణ ప్రారంభించిన హైకోర్టు దీనిపై వాదనలు కొనసాగించేందుకు బుధవారానికి వాయిదా వేసింది. బుధవారం వాదనలు విన్నాక తుది తీర్పు వెల్లడిస్తామని తెలిపింది.
హైకోర్టు సోమవారం ట్విస్ట్ ఇచ్చింది. తెలంగాణ ముందస్తు ఎన్నికల వేళ ఓటరు జాబితాపై హైకోర్టు ఏ తీర్పు వెల్లడిస్తుందా అన్న టెన్షన్ అన్ని రాజకీయ పక్షాల్లో నెలకొంది. ఓటర్ల జాబితా తప్పుల తడకగా ఉంటే మాత్రం ఎన్నికలు వాయిదా పడే అవకాశాలుంటాయి. దీంతో బుధవారం వచ్చే తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.