మంత్రి ఉమకి ఓటమి భయం? వేరే సీటుకు?
ఒకవైపు పులివెందుల రాజకీయం గురించి మాట్లాడుతూ ఉంటాడు మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు. పులివెందులలో జగన్ ను ఓడిస్తామని ప్రగల్భాలు పలుకుతుంటాడు. ఆ సంగతేమో కానీ.. ఈయన ఇప్పుడు సొంత నియోజకవర్గంలో మళ్లీ నెగ్గడం విషయంలో నమ్మకంతో లేడని తెలుస్తోంది. అందుకే ఇప్పుడు ఉమ వేరే నియోజకవర్గాన్ని వెతుక్కొనే పనిలో ఉన్నాడట. ప్రస్తుతం దేవినేని ఉమామహేశ్వరరావు మైలవరం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చాకచక్యంగా వ్యవహరిస్తోంది. అక్కడ వసంత కుటుంబాన్ని […]
ఒకవైపు పులివెందుల రాజకీయం గురించి మాట్లాడుతూ ఉంటాడు మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు. పులివెందులలో జగన్ ను ఓడిస్తామని ప్రగల్భాలు పలుకుతుంటాడు. ఆ సంగతేమో కానీ.. ఈయన ఇప్పుడు సొంత నియోజకవర్గంలో మళ్లీ నెగ్గడం విషయంలో నమ్మకంతో లేడని తెలుస్తోంది. అందుకే ఇప్పుడు ఉమ వేరే నియోజకవర్గాన్ని వెతుక్కొనే పనిలో ఉన్నాడట. ప్రస్తుతం దేవినేని ఉమామహేశ్వరరావు మైలవరం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న సంగతి తెలిసిందే.
ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చాకచక్యంగా వ్యవహరిస్తోంది. అక్కడ వసంత కుటుంబాన్ని రంగంలోకి దించింది. ఈ నేపథ్యంలో అక్కడ రాజకీయం రసకందాయంలో పడింది. వసంత రంగంలోకి దిగడం…. స్థానికంగా ఆయనకు ఉన్న పరిచయాలు, వైసీపీకి ఉన్న క్యాడర్, ప్రభుత్వ వ్యతిరేకత…. ఇవన్నీ కూడా ఇప్పుడు ఉమను భయభ్రాంతులకు లోను చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంతో చేసేది లేక ఉమ వేరే నియోజకవర్గం మీద కన్నేసినట్టుగా సమాచారం.
ఈ నేపథ్యంలో ఆయన మైలవరాన్ని వదిలి నూజివీడు నుంచి పోటీ చేసే ప్రయత్నంలో ఉన్నాడని సమాచారం. ఇప్పటికే మైలవరం నుంచి రెండు సార్లు గెలిచినా…. దేవినేని ఉమకు నియోజకవర్గంలో ఇప్పుడు గెలుస్తానన్న ధైర్యం లేదట. అందుకే ఇప్పుడు వేరే సీటును చూసుకుంటున్నట్టుగా సమాచారం.
కావాలంటే విజయవాడ ఎంపీగా పోటీ చేయడానికి సై అంటున్నాడట. మైలవరం నుంచి మాత్రం మళ్లీ పోటీ చేయనని దేవినేని ఉమ స్పష్టం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అంతన్నాడు… ఇంతన్నాడు… చివరకు సొంత నియోజకవర్గం నుంచి మళ్లీ పోటీ చేసేందుకు దేవినేని ముందే చేతులు ఎత్తేయడం ఏమిటో! అని సొంత పార్టీ నేతలే అంటున్నారు.