స్టేజిపై బస్కీలు తీసిన త్రిపుర సీఎం!
త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్ దేవ్‌కు నోటి దురుసు ఎక్కువని అంటుంటారు.. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తలలో నిలుస్తుంటారు. అయితే ఆయన చాలామంది బీజేపీ నాయకుల మాదిరి మాటల మనిషి కాదు చేతల మనిషి. కొల్‌కతాలో ఇండియా టుడే 2018 సదస్సులో వేదికపైనే బస్కీలు తీసి సభికుల చేత వహ్వా అనిపించుకున్నారు. మంచి ఫిట్‌నెస్ మెయిన్‌టెయిన్ చేస్తున్నారని కితాబులందుకున్నారు. సదస్సు జరుగుతుండగా కార్యక్రమ నిర్వాహకుడైన ఇండియా టుడే మేనేజింగ్ ఎడిటర్ రాహుల్ కన్వాల్ నుంచి ఆయన ఈ ఫిట్‌నెస్ […]

త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్ దేవ్‌కు నోటి దురుసు ఎక్కువని అంటుంటారు.. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తలలో నిలుస్తుంటారు. అయితే ఆయన చాలామంది బీజేపీ నాయకుల మాదిరి మాటల మనిషి కాదు చేతల మనిషి.
కొల్‌కతాలో ఇండియా టుడే 2018 సదస్సులో వేదికపైనే బస్కీలు తీసి సభికుల చేత వహ్వా అనిపించుకున్నారు. మంచి ఫిట్‌నెస్ మెయిన్‌టెయిన్ చేస్తున్నారని కితాబులందుకున్నారు.
సదస్సు జరుగుతుండగా కార్యక్రమ నిర్వాహకుడైన ఇండియా టుడే మేనేజింగ్ ఎడిటర్ రాహుల్ కన్వాల్ నుంచి ఆయన ఈ ఫిట్‌నెస్ ఛాలెంజ్‌ను స్వీకరించారు. ఆపకుండా 45 బస్కీలు తీయగలనని నిరూపించారు.

అంతకుముందు కేంద్ర మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ నుంచి కూడా బిప్లవ్‌దేవ్ ఫిట్‌నెస్ ఛాలెంజ్ స్వీకరించారు. ఫిట్‌నెస్ కోసం రోజూ ఎక్సర్‌సైజ్ చేస్తానని బిప్లవ్ ఈ సందర్భంగా వివరించారు. 10 నుంచి 15 నిమిషాల వ్యవధిలో 150 వరకు బస్కీలు తీయగలనని బిప్లవ్ చెప్పారు.