Telugu Global
NEWS

అక్కడ గెలుపు డిసైడ్ చేసేది కార్మికులే....

ఒక్క ఓటు గెలుపును డిసైట్ చేస్తుంది. అదే అందరూ ఒకే సారి మూకుమ్మడిగా ఒక నేతకు లేదా పార్టీకి ఓట్లు వేస్తే…. వారు సింగరేణి కార్మికులవుతారు. తప్పక ఆ పార్టీ విజయం సాధిస్తుంది. గడిచిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయంలో కార్మిక కుటుంబాలదే ప్రధాన పాత్ర. సింగరేణి కార్మికులు ఉత్తర తెలంగాణాలోని దాదాపు 10 నియోజకవర్గాల్లో విస్తరించి ఉన్నారు. కార్మికులు ఏ ప్రభుత్వమైనా, ప్రతిపక్ష పార్టీనైనా ఏదైనా లబ్ధి చేకూరిస్తే ఉప్పొంగిపోతారు. ఆకాశానికెత్తి విజయాన్ని కట్టబెడతారు. ఇప్పటి […]

అక్కడ గెలుపు డిసైడ్ చేసేది కార్మికులే....
X

ఒక్క ఓటు గెలుపును డిసైట్ చేస్తుంది. అదే అందరూ ఒకే సారి మూకుమ్మడిగా ఒక నేతకు లేదా పార్టీకి ఓట్లు వేస్తే…. వారు సింగరేణి కార్మికులవుతారు. తప్పక ఆ పార్టీ విజయం సాధిస్తుంది. గడిచిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయంలో కార్మిక కుటుంబాలదే ప్రధాన పాత్ర. సింగరేణి కార్మికులు ఉత్తర తెలంగాణాలోని దాదాపు 10 నియోజకవర్గాల్లో విస్తరించి ఉన్నారు.

కార్మికులు ఏ ప్రభుత్వమైనా, ప్రతిపక్ష పార్టీనైనా ఏదైనా లబ్ధి చేకూరిస్తే ఉప్పొంగిపోతారు. ఆకాశానికెత్తి విజయాన్ని కట్టబెడతారు. ఇప్పటి వరకు విజయం సాధించిన పార్టీలు కార్మిక ఓటర్లను ప్రసన్నం చేసుకున్నవే. గతంలో ఉన్న కార్మికుల సంఖ్య ఇప్పుడు లేదు. నానాటికీ తగ్గిపోతూ వస్తోంది.

రెండు దశాబ్దాల క్రితం లక్షా 20 వేల మంది ఉన్న కార్మికులు, దశాబ్దకాలంలో 84 వేలకి తగ్గిపోయారు. 2009 నాటికి 84వేల మంది సింగరేణి కార్మికులు, 2014 నాటికి 60 వేలకు తగ్గిపోయారు. ఇప్పుడు దాదాపు 55 వేల మంది వరకు ఉన్నారు. సంఖ్య ప్రస్తుతం తక్కువగా ఉన్నప్పటికీ, ఉత్తర తెలంగాణాలోని 10 నియోజకవర్గాల్లో విస్తరించి ఉన్న మాజీ కార్మికులతో కలుపుకుంటే, ఓట్ల సంఖ్య కాస్త ఎక్కువగానే ఉంటుంది. చాలా మంది మంచిర్యాల, గోదావరి ఖని ప్రాంతాల్లో స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉంటున్నారు.

రామగుండం నియోజవర్గ పరిధిలో ఆర్జీ-1, ఆర్జీ-2 డివిజన్ కార్మికులు బాగానే ఉంటారు. వీరి సంఖ్య 10,964 మంది వరకు ఉంటుంది. మంచిర్యాల నియోజకవర్గ పరిధిలోని శ్రీరాంపురం డివిజన్ ఉంది. ఈ డివిజన్‌ లో అత్యధికంగా 11వేల పైబడి కార్మికులు ఉన్నారు. వీరి ప్రభావం అభ్యర్థుల గెలుపోటములపై అధికంగానే ఉంటుందనడంలో సందేహం లేదు.

కానీ, రాజకీయ పార్టీలు వారిని పట్టించుకోవడం లేదనే నిరుత్సాహంలో ఉన్నారు. ఇందుకు కారణాలు లేకపోలేదు. గతంలో కార్మికుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు, అందరూ గంపగుత్తగా ఓట్లు వేసే పరిస్థితి ఉండటంతో, ఆయా పార్టీల అభ్యర్థులు గెలుపుకోసం కార్మిక నేతల చుట్టూ ప్రదక్షిణలు చేసేవారు. కార్మికుల సంఖ్య ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అసలు తమకే టిక్కెట్ ఇవ్వాలని సింగరేణి కార్మిక నేతలు పార్టీల అధిష్టానాలపై ఒత్తిడి తీసుకవచ్చేవారు. ప్రస్తుతం అసంఘటిత కార్మికుల సంఖ్య బాగా తగ్గిపోయింది. దీంతో తమను ఏ పార్టీ నేతలూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

First Published:  6 Oct 2018 6:03 PM GMT
Next Story