కొత్త మలుపు తిరిగిన శబరిమలలో మహిళల ఎంట్రీ వివాదం....
ఓ వైపు సుప్రీం తీర్పు…. మరో వైపు ఆచార వ్యవహారాలు.. వీటిలో దేన్ని అమలు చేయాలో తెలియక కేరళ ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. కేరళలో శబరిమల ఆలయంలోకి…. మహిళల ప్రవేశానికి అనుమతిస్తూ సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ తీర్పు వెలువడగానే కేరళ సీఎం పినరయి విజయ్ హర్షం వ్యక్తం చేశారు. మహిళల కోసం ఏకంగా మహిళా పోలీసులను నియమిస్తానని ప్రకటించారు. కానీ కేరళలో మహిళలు, సంప్రదాయ భక్తులు రోడ్డెక్కుతున్నారు. మహిళల ప్రవేశాన్ని రద్దు […]
ఓ వైపు సుప్రీం తీర్పు…. మరో వైపు ఆచార వ్యవహారాలు.. వీటిలో దేన్ని అమలు చేయాలో తెలియక కేరళ ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. కేరళలో శబరిమల ఆలయంలోకి…. మహిళల ప్రవేశానికి అనుమతిస్తూ సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ తీర్పు వెలువడగానే కేరళ సీఎం పినరయి విజయ్ హర్షం వ్యక్తం చేశారు. మహిళల కోసం ఏకంగా మహిళా పోలీసులను నియమిస్తానని ప్రకటించారు.
కానీ కేరళలో మహిళలు, సంప్రదాయ భక్తులు రోడ్డెక్కుతున్నారు. మహిళల ప్రవేశాన్ని రద్దు చేయాలని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. కేరళలోని పవిత్ర అయ్యప్ప ఆలయంలోకి మహిళలను అనుమతించవద్దంటూ ఏకంగా ఇప్పుడు అయ్యప్ప స్వామి దేవాలయంలో పూజలు చేసే పూజారులు ఆందోళన చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను వారు వ్యతిరేకిస్తున్నారు.
అంతేకాదు.. అయ్యప్ప దేవాలయంలోని సీనియర్ పూజారి మోహనారు కండరావు మాట్లాడుతూ…. సుప్రీం తీర్పునకు వ్యతిరేకంగా ప్రజల మనోభీష్టం మేరకు కేరళ ప్రభుత్వం రివ్యూ పిటీషన్ వేయాలని కోరారు. ఆ తర్వాత మేం చర్చలకు వస్తామని… రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఏదీ తేల్చనంత వరకూ మేం ఇందుకు మద్దతివ్వమని స్పష్టం చేశారు. వయసుతో సంబంధం లేకుండా మహిళలందరినీ అనుమతి ఇస్తే… అందులో రుతుక్రమం వచ్చే స్త్రీలు కూడా ఉంటారు. అలాంటి వాళ్లను అనుమతించడం ఆలయ సంప్రదాయాలకు విరుద్ధమని…. సన్నిధి ఆచారాలు దెబ్బతింటాయని పేర్కొన్నారు.
అయ్యప్ప పూజారుల తిరుగుబాటుతో ఇప్పుడు శబరిమల వివాదం కొత్త మలుపు తిరిగింది. వారి సహాయ నిరాకరణ, జనాభిప్రాయం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ప్రజాభిప్రాయం తీసుకోవాలని యోచిస్తోందట. కొట్టాయం, మలప్పురం జిల్లాల్లో ఆందోళనలు హింసాత్మకంగా మారిన దృష్ట్యా సుప్రీంలో కూడా రివ్యూ పిటీషన్ వేసేందుకు కేరళ సర్కారు నడుం బిగించింది.