Telugu Global
Health & Life Style

పోషకాల లోపంవల్ల స్థూలకాయం

జిహ్వచాపల్యం వల్లనే స్థూలకాయం ఏర్పడుతుందని చాలామంది భావిస్తారు. ఆహారంలో పోషక పదార్థాలు, ముఖ్యంగా సూక్ష్మపోషక పదార్థాలు, సరిఅయిన నిష్పత్తులలో లేనప్పుడు, శరీరం ఆ లోపాలను పూరించుకోవటానికి మరింతగా ఆకలివేయటం, ఇష్టమొచ్చిన ఆహారాన్ని మరింతగా ఆరగించటం, అవసరానికి మించి తీసుకున్న కార్బోహైడ్రేట్స్‌, మాంసం, నూనె పదార్థాలను దేహం కొవ్వుగా మార్చి నిలువచేయటం జరుగుతుంది. పండ్ల రసాలలో సూక్ష్మపోషక పదార్థాలన్నీ పుష్కలంగా ఉంటాయి గనుక, అనుదినం పండ్ల రసం తాగే వారిలో ఆకలి పరిమితులలో ఉంటుందని, బరువు తగ్గటం జరుగుతుందని, […]

పోషకాల లోపంవల్ల స్థూలకాయం
X
	జిహ్వచాపల్యం వల్లనే స్థూలకాయం ఏర్పడుతుందని చాలామంది భావిస్తారు. ఆహారంలో పోషక పదార్థాలు, ముఖ్యంగా సూక్ష్మపోషక పదార్థాలు, సరిఅయిన నిష్పత్తులలో లేనప్పుడు, శరీరం ఆ లోపాలను పూరించుకోవటానికి మరింతగా ఆకలివేయటం, ఇష్టమొచ్చిన ఆహారాన్ని మరింతగా ఆరగించటం, అవసరానికి మించి తీసుకున్న కార్బోహైడ్రేట్స్‌, మాంసం, నూనె పదార్థాలను దేహం కొవ్వుగా మార్చి నిలువచేయటం జరుగుతుంది. పండ్ల రసాలలో సూక్ష్మపోషక పదార్థాలన్నీ పుష్కలంగా ఉంటాయి గనుక, అనుదినం పండ్ల రసం తాగే వారిలో ఆకలి పరిమితులలో ఉంటుందని, బరువు తగ్గటం జరుగుతుందని, శక్తి  పెరుగుతుందని, వయసు తగ్గామనే భావన కలుగుతుందని పండ్లరసాల మీద అనేక పరిశోధనలు చేసినవారు పేర్కొంటున్నారు.
First Published:  7 Oct 2018 1:39 AM IST
Next Story