Telugu Global
NEWS

నామా నాగేశ్వర రావుకు దెబ్బ మీద దెబ్బ

తెలుగుదేశం మాజీ పార్లమెంట్‌ సభ్యుడు నామా నాగేశ్వర రావుకు చెందిన మధుకాన్‌ కంపెనీ పై వారం వ్యవధిలోనే దెబ్బ మీద దెబ్బ పడింది. ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణలో మోసపూరిత విధానాలను మధుకాన్‌ కంపెనీ అనుసరించిందని రుజువైన నేపథ్యంలో ఈ కంపెనీ పై ప్రపంచ బ్యాంక్‌ రెండేళ్ళపాటు నిషేధం విధించింది. ప్రపంచ బ్యాంక్‌ వివిధ దేశాల్లో అనేక ప్రాజెక్టులు చేపడుతుంది. వాటి కాంట్రాక్టులను వివిధ సంస్థలకు అప్పజెబుతుంది. అలా కాంట్రాక్టు పొందిన నామా నాగేశ్వర రావు కంపెనీ మధుకాన్‌ […]

నామా నాగేశ్వర రావుకు దెబ్బ మీద దెబ్బ
X

తెలుగుదేశం మాజీ పార్లమెంట్‌ సభ్యుడు నామా నాగేశ్వర రావుకు చెందిన మధుకాన్‌ కంపెనీ పై వారం వ్యవధిలోనే దెబ్బ మీద దెబ్బ పడింది. ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణలో మోసపూరిత విధానాలను మధుకాన్‌ కంపెనీ అనుసరించిందని రుజువైన నేపథ్యంలో ఈ కంపెనీ పై ప్రపంచ బ్యాంక్‌ రెండేళ్ళపాటు నిషేధం విధించింది.

ప్రపంచ బ్యాంక్‌ వివిధ దేశాల్లో అనేక ప్రాజెక్టులు చేపడుతుంది. వాటి కాంట్రాక్టులను వివిధ సంస్థలకు అప్పజెబుతుంది. అలా కాంట్రాక్టు పొందిన నామా నాగేశ్వర రావు కంపెనీ మధుకాన్‌ సంస్థ ప్రాజెక్టు నిర్మాణంలో మోసపూరిత విధానాలు అనుసరించినందు వల్ల ఆ సంస్థ పై ప్రపంచ బ్యాంక్‌ నిషేధం విధించింది. ఇది జరిగి నాలుగు రోజులు కాకముందే ఇదే సంస్థ పాల్పడిన మరో మోసం బయటపడింది.

టీడీపీ మాజీ పార్లమెంట్‌ సభ్యుడు నామా నాగేశ్వర రావుకు చెందిన మధుకాన్‌ సంస్థ ముంబైలో సొరంగం తవ్వకాల పనుల ప్రాజెక్టును కాంట్రాక్టు తీసుకొని ఆ పనిని శ్రీకృష్ణా రైల్‌ ఇంజనీర్స్‌ కంపెనీకి సబ్‌కాంట్రాక్టుకు ఇచ్చింది. వాళ్ళు ఆ పనిని పూర్తి చేశారు. దాని తాలూకూ బిల్లులు 4 కోట్ల రూపాయలు మధుకాన్‌ తీసుకుంది. కానీ సబ్‌ కాంట్రాక్టర్‌కు మాత్రం 96 లక్షలు మాత్రమే ఇచ్చి మిగిలిన డబ్బును ఎగ్గొట్టింది. దాంతో సబ్‌కాంట్రాక్ట్‌ చేసిన సంస్థ జాతీయ కంపెనీ లా ట్రిబ్యూనల్‌లో కేసు వేసింది.

ఆధారాలను పరిశీలించిన లా ట్రిబ్యూనల్‌ మధుకాన్‌ సంస్థ మోసాన్ని నిర్ధారించింది. మధుకాన్‌ దివాలా ప్రక్రియను ప్రారంభించేందుకు అనుమతి ఇచ్చి, దివాలా పరిష్కార నిపుణుడిగా రాకేష్‌ను నియమించింది. దానికితోడు మధుకాన్‌ ప్రాజెక్ట్‌ ఆస్తుల క్రయవిక్రయాలపై నిషేధం విధించింది.

తుదిమెరుపు ఏమిటంటే…. నామా నాగేశ్వర రావు కొద్ది నెలల క్రితం లైంగిక వేధింపుల కేసులో ఇరుక్కున్నాడు. ఇప్పుడు ఆర్థిక నేరాల్లో ఇరుక్కున్నాడు. అయినా తెలంగాణలో ఎన్నికల పొత్తులో భాగంగా టీడీపీ తరపున ఈయనకు టికెట్‌ ఇవ్వమని కాంగ్రెస్‌ పై టీడీపీ పెద్దలు ఒత్తిడి తెస్తుండడం విశేషం.

First Published:  7 Oct 2018 8:13 AM IST
Next Story