Telugu Global
National

వైసీపీ ఎంపీల రాజీనామా స్థానాలపై ఈసీ నిర్ణయం

తెలంగాణతో పాటు, దేశంలోని నాలుగు రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. దేశంలోని పలు స్థానాల్లో ఉప ఎన్నికలకు కూడా షెడ్యూల్ ప్రకటించింది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో ఉప ఎన్నికలు ఉండవని ప్రకటించింది. వైసీపీ ఎంపీలు రాజీనామా చేసిన స్థానాలతో పాటు అరకు అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక ఉండదని ఈసీ ప్రకటించింది. ఇటీవల మావోయిస్టుల దాడిలో ఫిరాయింపు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు చనిపోయారు. దీంతో అరకు స్థానం ఖాళీ అయింది. సాధారణ ఎన్నికలకు ఏడాది కాలం లేకపోవడంతో […]

వైసీపీ ఎంపీల రాజీనామా స్థానాలపై ఈసీ నిర్ణయం
X

తెలంగాణతో పాటు, దేశంలోని నాలుగు రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. దేశంలోని పలు స్థానాల్లో ఉప ఎన్నికలకు కూడా షెడ్యూల్ ప్రకటించింది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో ఉప ఎన్నికలు ఉండవని ప్రకటించింది. వైసీపీ ఎంపీలు రాజీనామా చేసిన స్థానాలతో పాటు అరకు అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక ఉండదని ఈసీ ప్రకటించింది.

ఇటీవల మావోయిస్టుల దాడిలో ఫిరాయింపు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు చనిపోయారు. దీంతో అరకు స్థానం ఖాళీ అయింది.

సాధారణ ఎన్నికలకు ఏడాది కాలం లేకపోవడంతో లోక్‌సభ స్థానాలతో పాటు, అరకు స్థానానికి ఉప ఎన్నిక ఉంటుందా లేదా అన్న దానిపై చర్చ జరిగింది. అయితే ఈ చర్చకు ఈసీ తెరదింపింది. ఏపీలో ఉప ఎన్నికలు జరగవని వెల్లడించింది. ఛత్తీస్‌గఢ్ లో రెండు విడతలుగా పోలింగ్ నిర్వహిస్తారు.

తొలి దశలో 18 అసెంబ్లీ నియోజకవర్గాలకు అక్టోబర్ 16న నోటిఫికేషన్ జారీ చేస్తారు. తొలి విడత 18 స్థానాల్లో పోలింగ్ నవంబర్ 12న నిర్వహిస్తారు. రెండో విడత 72స్థానాలకు పోలింగ్ నవంబర్ 20 న జరుగుతుంది.

మధ్యప్రదేశ్, మిజోరంలో ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తారు. రెండు రాష్ట్రాల్లో నవంబర్ 28న పోలింగ్ జరుగుతుంది. రాజస్థాన్‌, తెలంగాణకు ఒకే తేదీల్లో ఒకేసారి పోలింగ్ జరుగుతుంది. అన్ని రాష్ట్రాల ఫలితాలు డిసెంబర్ 11న విడుదల అవుతాయి.

First Published:  6 Oct 2018 10:50 AM IST
Next Story