Telugu Global
NEWS

ఒక్కో నియోజకవర్గంలో అన్ని కోట్లు ఖర్చా?

తెలుగుదేశం పార్టీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కో నియోజకవర్గంలో కోట్ల రూపాయలు వెదజల్లుతుందనే అంచనాలున్నాయి. గత నాలుగేళ్లలో తెలుగుదేశం సిట్టింగ్ ఎమ్మెల్యేలు, నేతలు, నియోజకవర్గం ఇన్ చార్జిల దగ్గర నుంచి…. జన్మభూమి కమిటీ సభ్యుల వరకూ సంపాదించుకోవడంలో పోటీలు పడ్డారనే అభిప్రాయాలున్నాయి. కొంతమంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు అయితే అవినీతి, అక్రమ సంపాదనను వంద కోట్ల రూపాయల పై మార్కును అందుకున్నారనే టాక్ నడుస్తోంది. కమిషన్లు, ఇతర సంపాదనల రూపంలోనే వీరు ఈ స్థాయిలో సంపాదించుకున్నారని టాక్. ఇదిలా […]

ఒక్కో నియోజకవర్గంలో అన్ని కోట్లు ఖర్చా?
X

తెలుగుదేశం పార్టీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కో నియోజకవర్గంలో కోట్ల రూపాయలు వెదజల్లుతుందనే అంచనాలున్నాయి. గత నాలుగేళ్లలో తెలుగుదేశం సిట్టింగ్ ఎమ్మెల్యేలు, నేతలు, నియోజకవర్గం ఇన్ చార్జిల దగ్గర నుంచి…. జన్మభూమి కమిటీ సభ్యుల వరకూ సంపాదించుకోవడంలో పోటీలు పడ్డారనే అభిప్రాయాలున్నాయి.

కొంతమంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు అయితే అవినీతి, అక్రమ సంపాదనను వంద కోట్ల రూపాయల పై మార్కును అందుకున్నారనే టాక్ నడుస్తోంది. కమిషన్లు, ఇతర సంపాదనల రూపంలోనే వీరు ఈ స్థాయిలో సంపాదించుకున్నారని టాక్.

ఇదిలా ఉంటే…. వాళ్లు వ్యక్తిగతంగా పెట్టే ఖర్చు సంగతలా ఉంటే…. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధిష్టానమే ఒక్కో నియోజకవర్గంలో కనీసం ఇరవై కోట్లు ఖర్చు పెట్టడానికి రెడీ అయిపోతోందనే మాట వినిపిస్తోంది.

అటు ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్, ఇటు పవన్ కల్యాణ్ కూడా అదే మాట చెబుతున్నారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్న నేపథ్యంలో…. ఇప్పుడే నియోజకవర్గాలకు సొమ్ములు చేరవేయడానికి తెలుగుదేశం పార్టీ రెడీ అయిపోతోందని వీరు అంటున్నారు. ఒక్కో నియోజకవర్గానికి చంద్రబాబు తరఫు నుంచి ఇరవై కోట్ల రూపాయల మొత్తాన్ని చేరవేస్తున్నారని అంటున్నారు.

రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఒక్కో నియోజకవర్గానికి ఇరవై కోట్ల రూపాయలు అంటే…. దాదాపు 3,500 కోట్ల రూపాయలు ఖర్చు అని చెప్పాలి. ఇది కేవలం తెలుగుదేశం పార్టీ అధిష్టానం వాటా మాత్రమే.

ఇక నియోజకవర్గాల ఇన్ చార్జిలు, నేతల వాటా వేరే అని…. వారు కూడా తమ శక్తి మేర కొన్ని పదుల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి రెడీ అవుతున్నారని టాక్ వినిపిస్తోంది.

మొత్తానికి ఏపీ రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేనంత స్థాయి ఖర్చులతో వచ్చే ఎన్నికలు జరగబోతున్నాయని స్పష్టం అవుతోంది.

First Published:  6 Oct 2018 6:41 AM IST
Next Story