29 ఏళ్ల నాటి సినిమాకు ట్రెండింగ్
టాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన సినిమాలు, బ్లాక్ బస్టర్ విజయం సాధించిన సినిమాలు చాలా ఉన్నాయి. కానీ ఇండస్ట్రీ గతిని మార్చిన సినిమాలు మాత్రం చాలా కొద్దిగా ఉన్నాయి. అలాంటి అతికొద్ది సినిమాల్లో ఒకటి శివ సినిమా. నాగార్జున హీరోగా నటించిన ఈ సినిమా ఇప్పుడు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. దీనికి కారణం, ఈ సినిమా విడుదలై నేటికి సరిగ్గా 29 ఏళ్లు పూర్తికావడమే. రామ్ గోపాల్ వర్మను దర్శకుడిగా పరిచయం […]
టాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన సినిమాలు, బ్లాక్ బస్టర్ విజయం సాధించిన సినిమాలు చాలా ఉన్నాయి. కానీ ఇండస్ట్రీ గతిని మార్చిన సినిమాలు మాత్రం చాలా కొద్దిగా ఉన్నాయి. అలాంటి అతికొద్ది సినిమాల్లో ఒకటి శివ సినిమా. నాగార్జున హీరోగా నటించిన ఈ సినిమా ఇప్పుడు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. దీనికి కారణం, ఈ సినిమా విడుదలై నేటికి సరిగ్గా 29 ఏళ్లు పూర్తికావడమే.
రామ్ గోపాల్ వర్మను దర్శకుడిగా పరిచయం చేస్తూ, తమ సొంత బ్యానర్ పై నాగార్జున నిర్మించిన సినిమా ఇది. కెరీర్ లో నాగార్జునకు ఇది 17వ చిత్రం. అప్పటికి నాగ్ కు స్టార్ స్టేటస్ కూడా రాలేదు. అలాంటి టైమ్ లో శివ లాంటి ప్రయోగాలు వద్దని ఏఎన్నార్ స్వయంగా నాగ్ ను మందలించారు. అయినప్పటికీ నాగ్ వినలేదు. ఎందుకో వర్మను గట్టిగా నమ్మారు. అదే నిజమైంది. శివ సినిమా ట్రెండ్ సెట్ చేసింది.
అప్పటివరకు మూస పద్ధతిలో సాగిపోతున్న టాలీవుడ్ ను ఓ మలుపు తిప్పింది శివ. షాట్ డివిజన్, సౌండ్ డిజైనింగ్, సినిమాటోగ్రఫీ, మేకింగ్, పోస్టర్ డిజైనింగ్.. ఇలా దాదాపు ప్రతి విభాగంలో శివ సినిమాది ట్రెండ్. టాలీవుడ్ లో మొట్టమొదటిసారి స్టడీకామ్ ను వాడిన సినిమా కూడా ఇదే.
అలా నాగ్ కెరీర్ లో మరపురాని చిత్రంగా నిలిచిపోయిన శివను మరోసారి అక్కినేని అభిమానులంతా గుర్తుచేసుకుంటున్నారు. అలా గుర్తుచేసుకునే క్రమంలో శివ సినిమా మరోసారి ట్రెండింగ్ లో నిలిచింది.