తేల్చుకోండి.... లేదంటే వేరే వారికే " నగరి పై బాబు
చిత్తూరు జిల్లా నగరి టీడీపీలో వివాదం కొనసాగుతోంది. గాలి ముద్దుకృష్ణమ నాయుడు చనిపోయిన తర్వాత నియోజకవర్గ టీడీపీ నాయకత్వంపై స్పష్టత లేకుండా పోయింది. గాలి కుమారులు ఇద్దరు నాయకత్వం కోసం కత్తులు దూసుకోవడమే అందుకు కారణం. ముద్దు కృష్ణమ కుమారులు భాను, జగదీష్ ఇద్దరూ టికెట్ ఆశిస్తున్నారు. గాలి ముద్దు కృష్ణమ నాయుడు మరణం తర్వాత ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానం విషయంలోనూ ఇద్దరు కుమారులు పట్టింపులకు పోయారు. దీంతో గాలి ముద్దుకృష్ణమ నాయుడు భార్యకు ఎమ్మెల్సీ […]
చిత్తూరు జిల్లా నగరి టీడీపీలో వివాదం కొనసాగుతోంది. గాలి ముద్దుకృష్ణమ నాయుడు చనిపోయిన తర్వాత నియోజకవర్గ టీడీపీ నాయకత్వంపై స్పష్టత లేకుండా పోయింది. గాలి కుమారులు ఇద్దరు నాయకత్వం కోసం కత్తులు దూసుకోవడమే అందుకు కారణం. ముద్దు కృష్ణమ కుమారులు భాను, జగదీష్ ఇద్దరూ టికెట్ ఆశిస్తున్నారు.
గాలి ముద్దు కృష్ణమ నాయుడు మరణం తర్వాత ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానం విషయంలోనూ ఇద్దరు కుమారులు పట్టింపులకు పోయారు. దీంతో గాలి ముద్దుకృష్ణమ నాయుడు భార్యకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఇప్పుడు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఎవరు ఉంటారన్న దానిపైనా స్పష్టత లేదు.
ఈ నేపథ్యంలో నగరి నియోజకవర్గంపై అమరావతిలో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు…. ఇన్‌చార్జ్‌గా ఎవరు ఉంటారో నిర్ణయించుకోవాలని గాలి కుమారులకు స్పష్టం చేశారు. కుటుంబంలో చర్చించుకుని తనకు వెంటనే ఏదో ఒక నిర్ణయం తెలియజేయాలని భాను, జగదీష్‌కు స్పష్టం చేశారు. ఒకవేళ కుటుంబంలో ఏకాభిప్రాయం రాని పక్షంలో కొత్త వారికి అవకాశం ఇస్తామని కూడా చంద్రబాబు స్పష్టం చేశారు.
గాలి కుమారుల మధ్య రాజీ కుదరని పక్షంలో సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్‌ల యజమాని అశోక్‌కు టికెట్ ఇచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. దీంతో నగరిలో గాలి ముద్దుకృష్ణమ కుటుంబ నాయకత్వం ఉంటుందా, పోతుందా అన్నది ఇద్దరు కుమారుల వ్యవహారశైలి మీద ఆధారపడి ఉంది.