లోకేష్ షరా మామూలే.... మళ్లీ దొరికాడు!
తన మాటల్లో తడబాట్లతో నవ్వుల పాలవ్వడం నారా లోకేష్‌కు కొత్తేమీ కాదు. లోకేష్ ప్రసంగిస్తే…. తప్పులు దొర్లడం అటుంచి, తప్పులు దొర్లకపోతే అదే విశేషం అవుతూ ఉంది. ఆది నుంచి లోకేష్ తీరు ఇదే రీతిన నడుస్తూ ఉంది. ఈ పరంపరలో తాజాగా లోకేష్ బాబు మరోసారి పప్పులో కాలేశాడు. తిరుపతిలో జరిగిన ఒక కార్యక్రమంలో లోకేష్ ప్రసంగం వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. తిరుపతిని ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీకి కేరాఫ్‌గా మారుస్తామని చంద్రబాబు నాయుడి తనయుడు […]
తన మాటల్లో తడబాట్లతో నవ్వుల పాలవ్వడం నారా లోకేష్‌కు కొత్తేమీ కాదు. లోకేష్ ప్రసంగిస్తే…. తప్పులు దొర్లడం అటుంచి, తప్పులు దొర్లకపోతే అదే విశేషం అవుతూ ఉంది. ఆది నుంచి లోకేష్ తీరు ఇదే రీతిన నడుస్తూ ఉంది. ఈ పరంపరలో తాజాగా లోకేష్ బాబు మరోసారి పప్పులో కాలేశాడు.
తిరుపతిలో జరిగిన ఒక కార్యక్రమంలో లోకేష్ ప్రసంగం వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
తిరుపతిని ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీకి కేరాఫ్‌గా మారుస్తామని చంద్రబాబు నాయుడి తనయుడు చెప్పుకొచ్చాడు. అదంతా తమ ఘనతే అని చెప్పకొచ్చాడు. చైనాకు వెళ్లి తిరుపతి గురించి చెబితే ఎవరికీ తెలియదని…. ఇప్పుడు చైనా కంపెనీలన్నీ ఇక్కడకు తరలి వస్తున్నాయని…. లోకేష్ చెప్పుకొచ్చాడు. ఈ చెప్పడంలో కూడా లోకేష్ నోరు చాలా సార్లు తడబడింది.
ఇక ‘నాలుగేళ్ల కిందట ఇండియాలో తయారయ్యే ఫోన్లలో ఆంధ్రప్రదేశ్ వాటా సున్నా….’ అని చెప్పిన లోకేష్ ఇప్పుడు మాత్రం ఏపీ వాటా పెరిగిందని చెప్పుకొచ్చాడు. ఈ చెప్పుకురావడంలోనే లోకేష్ తడబడ్డాడు. ‘ఇండియాలో తయారయ్యే ప్రతి వంద ఫోన్లలో ఏపీ వాటా 260….’ అని అన్నాడు లోకేష్. మొదటేమో వందలో ఒక్క ఫోన్ కూడా ఏపీలో తయారు కాలేదని చెప్పాడు. తర్వాతేమో వందకు 260 ఫోన్లు ఏపీలో తయారవుతున్నాయి.. అని లోకేష్ చెప్పుకొచ్చాడు.
వందకు 260 ఫోన్లు ఏపీలో తయారు కావడం ఏమిటి? అనే అంశం ఎవరికీ అంతుబట్టేది కాదు. లోకేష్ ఏదో చెప్పబోయి, మరేదో చెప్పాడని ఇక్కడ స్పష్టం అవుతోంది.