దివాకర్ రెడ్డీ దమ్ముంటే.... నీవే రా....
తాడిపత్రిలో పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి. ప్రతిపక్ష నాయకుల పైనా ఆంక్షలు విధిస్తున్నారు. నియోజక వర్గంలోని ముచ్చకోట రిజర్వాయర్‌కు నీటిని విడుదల చేయాలన్న డిమాండ్‌తో వైసీపీ ఇన్చార్జ్ పెద్దారెడ్డి చేపట్టిన పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. పాదయాత్రకు అనుమతి లేదంటూ ఆయన్ను అరెస్ట్ చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ముచ్చుకోట నుంచి పెద్దపప్పూరు దాకా పాదయాత్ర చేసేందుకు వచ్చిన పెద్దారెడ్డిని పోలీసులు పాదయాత్ర ప్రారంభంలోనే అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ కార్యకర్తలను కూడా అరెస్ట్ చేశారు. పోలీసుల తీరుపై పెద్దారెడ్డి […]
తాడిపత్రిలో పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి. ప్రతిపక్ష నాయకుల పైనా ఆంక్షలు విధిస్తున్నారు. నియోజక వర్గంలోని ముచ్చకోట రిజర్వాయర్‌కు నీటిని విడుదల చేయాలన్న డిమాండ్‌తో వైసీపీ ఇన్చార్జ్ పెద్దారెడ్డి చేపట్టిన పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు.
పాదయాత్రకు అనుమతి లేదంటూ ఆయన్ను అరెస్ట్ చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ముచ్చుకోట నుంచి పెద్దపప్పూరు దాకా పాదయాత్ర చేసేందుకు వచ్చిన పెద్దారెడ్డిని పోలీసులు పాదయాత్ర ప్రారంభంలోనే అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ కార్యకర్తలను కూడా అరెస్ట్ చేశారు.
పోలీసుల తీరుపై పెద్దారెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జేసీ బ్రదర్స్ ఒత్తిడితోనే పోలీసులు తన యాత్రను అడ్డుకున్నారని ఆరోపించారు. తాడిపత్రిలో పోలీసులకు ఎస్పీ ఆదేశాల కంటే జేసీ ఆదేశాలు కీలకంగా మారాయని మండిపడ్డారు.
జేసీ దివాకర్ రెడ్డికి దమ్ముంటే ఈ సారి ఎన్నికల్లో తాడిపత్రి నియోజకవర్గం నుంచి తనపై పోటీ చేయాలని పెద్దారెడ్డి సవాల్ చేశారు.
ముచ్చకోట రిజర్వాయర్‌కు నీటిని ఇప్పించడం కూడా జేసీ బ్రదర్స్‌కు చేతకావడం లేదన్నారు. జేసీ బ్రదర్స్‌కు ఓటమి భయం పట్టుకుందన్నారు.