విండీస్ తో తొలిటెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ విజయం
మూడురోజుల ముచ్చటగా ముగిసిన రాజ్ కోట్ టెస్ట్ ఇన్నింగ్స్ 272 పరుగులతో నెగ్గిన టీమిండియా రాజ్ కోట టెస్ట్ మూడు రోజుల ముచ్చటగా ముగిసింది. టెస్ట్ క్రికెట్ టాప్ ర్యాంకర్ టీమిండియా ఇన్నింగ్స్ 272 పరుగుల తేడాతో… 8వ ర్యాంకర్ విండీస్ ను చిత్తు చేసి… రెండుమ్యాచ్ ల సిరీస్ లో 1-0 ఆధిక్యం సంపాదించింది. ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఆట కొనసాగించిన కరీబియన్ టీమ్… తొలి ఇన్నింగ్స్ లో 181 పరుగులకే కుప్పకూలి… ఫాలోఆన్ […]
- మూడురోజుల ముచ్చటగా ముగిసిన రాజ్ కోట్ టెస్ట్
- ఇన్నింగ్స్ 272 పరుగులతో నెగ్గిన టీమిండియా
రాజ్ కోట టెస్ట్ మూడు రోజుల ముచ్చటగా ముగిసింది. టెస్ట్ క్రికెట్ టాప్ ర్యాంకర్ టీమిండియా ఇన్నింగ్స్ 272 పరుగుల తేడాతో… 8వ ర్యాంకర్ విండీస్ ను చిత్తు చేసి… రెండుమ్యాచ్ ల సిరీస్ లో 1-0 ఆధిక్యం సంపాదించింది.
ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఆట కొనసాగించిన కరీబియన్ టీమ్… తొలి ఇన్నింగ్స్ లో 181 పరుగులకే కుప్పకూలి… ఫాలోఆన్ ట్రాప్ లో చిక్కుకొంది. విండీస్ రెండో ఇన్నింగ్స్ లో సైతం తేలిపోయింది.
టీమిండియా స్పిన్ త్రయం ముప్పేటదాడిలో విండీస్ 196 పరుగులకే ఆలౌటయ్యింది. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 5 వికెట్లు, జడేజా 3 వికెట్లు, అశ్విన్ 2 వికెట్లు పడగొట్టారు. ఓపెనర్ పావెల్ ఒక్కడే పోరాడి ఆడి 83 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచినా ఘోరపరాజయం తప్పలేదు.
అరంగేట్రం టెస్టులోనే సెంచరీతో చెలరేగిన యువ ఓపెనర్ పృథ్వీ షాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. సిరీస్ లోని ఆఖరి టెస్ట్ మ్యాచ్ హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఈనెల 12న ప్రారంభమవుతుంది.