Telugu Global
NEWS

కేసీఆర్ ఏం పీకాడు? డీకే అరుణ సంచలన ఆరోపణలు

డీకే అరుణ నిప్పులు చెరిగారు. కేసీఆర్ తనపై చేసిన విమర్శలకు గట్టి కౌంటర్లు ఇచ్చారు. వనపర్తి సభలో గద్వాల తాజా మాజీ ఎమ్మెల్యే డీకే అరుణపై తీవ్ర విమర్శలు చేసిన కేసీఆర్ పై శనివారం ఉదయం విలేకరులతో మాట్లాడుతూ డీకే అరుణ్ సంచలన ఆరోపణలు చేశారు. నా బండారం బయటపెడుతానన్న కేసీఆర్… ఓ శక్తితో పెట్టుకుంటున్నాడన్న విషయం మరిచిపోవద్దని అరుణ హెచ్చరించారు. గద్వాలలో ఇంటింటికి నా సంగతి వివరిస్తానన్న కేసీఆర్…. ఆ ఇంటింట నా ఫోటో ఉన్న […]

కేసీఆర్ ఏం పీకాడు? డీకే అరుణ సంచలన ఆరోపణలు
X

డీకే అరుణ నిప్పులు చెరిగారు. కేసీఆర్ తనపై చేసిన విమర్శలకు గట్టి కౌంటర్లు ఇచ్చారు. వనపర్తి సభలో గద్వాల తాజా మాజీ ఎమ్మెల్యే డీకే అరుణపై తీవ్ర విమర్శలు చేసిన కేసీఆర్ పై శనివారం ఉదయం విలేకరులతో మాట్లాడుతూ డీకే అరుణ్ సంచలన ఆరోపణలు చేశారు. నా బండారం బయటపెడుతానన్న కేసీఆర్… ఓ శక్తితో పెట్టుకుంటున్నాడన్న విషయం మరిచిపోవద్దని అరుణ హెచ్చరించారు.

గద్వాలలో ఇంటింటికి నా సంగతి వివరిస్తానన్న కేసీఆర్…. ఆ ఇంటింట నా ఫోటో ఉన్న విషయం చూడు అంటూ తెలిపారు. నీ జాతకం ఏందో, నా జాతకం ఏందో తేల్చుకుందాం రా అంటూ సవాల్ విసిరారు. శ్రీశైలం నీళ్లు రఘువీరారెడ్డి తీసుకుపోతే మంగళహారతులు పట్టానని కేసీఆర్ అంటున్నారని…. దాని ఫొటోలు, వీడియోలు ఉంటే చూపించు దమ్ముంటే అని విరుచుకుపడ్డారు.

కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకొని నాలుగు సీట్లు సంపాదించుకొని కేంద్రమంత్రివి అయ్యావని కేసీఆర్ పై విరుచుకుపడ్డారు డీకే అరుణ. ఎంపీగా పాలమూరు జిల్లాకు ఏం చేశావో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులకు కాలువ కట్టలేని కేసీఆర్ లక్షల ఎకరాలకు నీళ్లిచ్చాడని అభూతకల్పనలు ప్రచారం చేస్తున్నాడని అరుణ మండిపడ్డారు.

తెలంగాణలో ఎవ్వరూ కేసీఆర్ లా ఇంత నీచంగా మాట్లాడరని…. ఓ దొరలా మాట్లాడుతున్నాడని డీకే అరుణ మండిపడ్డారు. ఆయన మాట్లాడితే మంత్రాల్లా.. తాము మాట్లాడితే తిట్లలా వినిపిస్తాయా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ మహిళను వేదికపై అవమానిస్తావా.? నీకు మహిళల శాపం, జోగులాంబ తల్లి ఉసురు తగులుతుందని మండిపడ్డారు.

ఉస్మానియా పిల్లలను అడ్డుపెట్టుకొని దొంగ దీక్షలు చేశావని…. విద్యార్థుల ప్రాణాలు పోతున్నాయని…. కేసీఆర్ ఉద్యమంతో ప్రాణాలు తీస్తున్నాడని తామే సోనియాగాంధీని ఒప్పించి తెలంగాణ తెచ్చామని డీకే అరుణ చెప్పుకొచ్చారు. ఉద్యమకారులకు కేసీఆర్ ఏం చేశాడో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎంత మందిని ఆదుకున్నాడో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

పాలమూరు జిల్లా నుంచే నీ పతనం ప్రారంభమైందని కేసీఆర్ ను హెచ్చరించారు డీకే అరుణ. జోగులాంబ సాక్షిగా పూజలు చేసి కాంగ్రెస్ శంఖారావం పూరించిందని.. గద్వాల లో సభ పెడితే 30వేల మంది వచ్చారని .. నీ వనపర్తి సభకు 40వేల మంది కూడా ఉమ్మడి జిల్లా నుంచి రాలేదని అరుణ ఎద్దేవా చేశారు. దగాకోర్, జూటాకోర్ మాటలు మాట్లాడుతావా అంటూ మండిపడ్డారు. కేసీఆర్ తిట్టిన ప్రతి మాటలకు కౌంటర్లు ఇస్తూ…. అదే స్థాయిలో దుమ్మెత్తి పోస్తూ డీకే అరుణ శనివారం నిప్పులు చెరిగారు.

First Published:  6 Oct 2018 12:03 AM GMT
Next Story