వేమూరి రాధాకృష్ణపై ఉత్తరాంధ్ర సంఘాల ఆగ్రహం
ఏబీఎన్ ఆంధ్రప్రదేశ్ ఎండీ వేమూరి రాధాకృష్ణపై ఉత్తరాంధ్రకు చెందిన ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఉత్తరాంధ్ర అంటే రాధాకృష్ణకు అంత చులకన భావం ఎందుకుని ప్రశ్నించారు. శ్రీకాకుళంలో ఉత్తరాంధ్ర రచయితలు, కవుల వేదిక సమావేశం జరిగింది. ఇటీవల టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడిని ఇంటర్వ్యూ చేస్తున్న సమయంలో రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలను వేదిక తప్పుపట్టింది. టీడీపీ ఎంపీ హిందీ ప్రతిభను ప్రశంసించే క్రమంలో ఉత్తరాంధ్ర వారికి పొట్ట చించితే హిందీ అక్షరం రాదు కదా? అని రాధాకృష్ణ […]
ఏబీఎన్ ఆంధ్రప్రదేశ్ ఎండీ వేమూరి రాధాకృష్ణపై ఉత్తరాంధ్రకు చెందిన ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఉత్తరాంధ్ర అంటే రాధాకృష్ణకు అంత చులకన భావం ఎందుకుని ప్రశ్నించారు.
శ్రీకాకుళంలో ఉత్తరాంధ్ర రచయితలు, కవుల వేదిక సమావేశం జరిగింది. ఇటీవల టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడిని ఇంటర్వ్యూ చేస్తున్న సమయంలో రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలను వేదిక తప్పుపట్టింది. టీడీపీ ఎంపీ హిందీ ప్రతిభను ప్రశంసించే క్రమంలో ఉత్తరాంధ్ర వారికి పొట్ట చించితే హిందీ అక్షరం రాదు కదా? అని రాధాకృష్ణ వ్యాఖ్యానించారు.
ఉత్తరాంధ్రను చులకన చేసేలా వ్యాఖ్యలు చేసిన రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలని వేదిక ప్రధాన కార్యదర్శి సన్నశెట్టి రాజశేఖర్ డిమాండ్ చేశారు. రాధాకృష్ణ తీరును ఎండగడుతూ బహిరంగ లేఖ రాస్తున్నట్టు చెప్పారు. తమ ప్రాంతాన్నిహేళన చేస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు. ఎంతో ఘన చరిత్ర ఉన్న ఉత్తరాంధ్రను కార్పొరేట్ శక్తులతో కుమ్మక్కు అయి పాలకులు, పత్రికాధిపతులు కించపరుస్తున్నారని వేదిక మండిపడింది.