Telugu Global
NEWS

రేవంత్ స్టామినాను ఈ ఎన్నిక‌లే తేలుస్తాయా?

రేవంత్‌రెడ్డి. తెలంగాణ కాంగ్రెస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌. తెలంగాణ రాజ‌కీయాల్లో ఇప్పుడొక ఫైర్‌బ్రాండ్‌. ఐటీ కేసుల‌తో రేవంత్ చుట్టూ మ‌ళ్లీ రాజ‌కీయాలు న‌డుస్తున్నాయి. రేవంత్ కేసులు ఏమ‌వుతాయి? అనే ప్ర‌శ్న అంత‌టా వినిపిస్తోంది. అయితే ఈ ఎన్నిక‌ల్లో రేవంత్ ఇమేజ్ కాంగ్రెస్‌కు ఎంత వ‌ర‌కు క‌లిసివ‌స్తుంది? ఆయ‌న ప్ర‌భావం ఎంత‌మేర‌కు ఉంటుంద‌నే ప్ర‌శ్న‌లు బ‌య‌ల్దేరాయి. టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన‌ప్పుడు త‌నతో పాటు 18 మంది కీల‌క నేత‌లు వ‌చ్చారు. వారిలో క‌నీసం ప‌దిమందికి టికెట్లు ఇప్పించుకోవాల‌ని రేవంత్ […]

రేవంత్ స్టామినాను ఈ ఎన్నిక‌లే తేలుస్తాయా?
X

రేవంత్‌రెడ్డి. తెలంగాణ కాంగ్రెస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌. తెలంగాణ రాజ‌కీయాల్లో ఇప్పుడొక ఫైర్‌బ్రాండ్‌. ఐటీ కేసుల‌తో రేవంత్ చుట్టూ మ‌ళ్లీ రాజ‌కీయాలు న‌డుస్తున్నాయి. రేవంత్ కేసులు ఏమ‌వుతాయి? అనే ప్ర‌శ్న అంత‌టా వినిపిస్తోంది. అయితే ఈ ఎన్నిక‌ల్లో రేవంత్ ఇమేజ్ కాంగ్రెస్‌కు ఎంత వ‌ర‌కు క‌లిసివ‌స్తుంది? ఆయ‌న ప్ర‌భావం ఎంత‌మేర‌కు ఉంటుంద‌నే ప్ర‌శ్న‌లు బ‌య‌ల్దేరాయి.

టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన‌ప్పుడు త‌నతో పాటు 18 మంది కీల‌క నేత‌లు వ‌చ్చారు. వారిలో క‌నీసం ప‌దిమందికి టికెట్లు ఇప్పించుకోవాల‌ని రేవంత్ ప్ర‌య‌త్నం. ఈ ప‌దిమందిని గెలిపించుకోవాల‌ని రేవంత్ చూస్తున్నారు. వీరితో పాటు కాంగ్రెస్‌లో యువ‌త‌రంను రేవంత్ ఆక‌ట్టుకోగ‌లిగాడు. కాంగ్రెస్‌లోని పాత నేత‌ల్లో రేవంత్ వైపు ఐదు నుంచి ప‌ది మంది చూస్తున్నారు. వీరినంతా క‌లుపుకుంటే రేవంత్ బ్యాచ్ 20 మంది అవుతారు. ఈ 20 మంది నేత‌ల‌ను గెలిపిస్తే త‌న వ‌ర్గంగా చ‌లామ‌ణీ అవుతార‌నేది రేవంత్ ఒక అంచ‌నా.

రేవంత్‌కు ప్ర‌చార‌క‌మిటీ బాధ్య‌త‌లు అప్ప‌గించ‌లేదు. కానీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో రేవంత్‌ను ప్ర‌చారానికి చాలా మంది నేత‌లు పిలుస్తున్నారు. ష‌బ్బీర్ అలీ, చిన్నారెడ్డి లాంటి నేత‌లు ఇప్ప‌టికే త‌మ నియోజ‌క‌వ‌ర్గాలకు తీసుకెళ్లారు. స‌భ‌లు పెట్టారు. క‌నీసం 50 మంది నేత‌లు రేవంత్ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌చారం నిర్వ‌హించాల‌ని కోరుతున్నార‌ట‌. రేవంత్ వ‌స్తే త‌మ‌కు మైలేజీ వ‌స్తుంది. కార్య‌క‌ర్త‌ల్లో జోష్ వ‌స్తోంది. ఒక ఊపు వస్తుంద‌ని నేత‌లు భావిస్తున్నార‌ట‌. అందుకే నేత‌లు రేవంత్‌ను ప్ర‌చారానికి రావాల‌ని కోరుతున్న‌ట్లు తెలుస్తోంది.

మ‌రోవైపు రేవంత్‌కి కూడా ఈ ఎన్నిక‌లు ఓ అగ్నిప‌రీక్షే. కొడంగ‌ల్‌లో తాను విజ‌యం సాధించ‌డంతో పాటు త‌న వ‌ర్గం నేత‌ల‌ను గెలిపించుకోవాలి. త‌న స్టామినా నిరూపించుకోవాలి. త‌న వ‌ర్గం ఉంటేనే…. రాబోయే ఎన్నిక‌ల వ‌ర‌కు కీల‌కంగా మార‌వ‌చ్చు. అందుకోస‌మే ఈ ఎన్నిక‌ల‌ను రేవంత్ కీల‌కంగా తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

First Published:  5 Oct 2018 1:55 AM IST
Next Story