Telugu Global
National

రాజ్‌కోట టెస్ట్ పై టీమిండియా పట్టు

ఇన్నింగ్స్ ఓటమి ప్రమాదంలో విండీస్ విండీస్ 94 పరుగులకే 6 వికెట్లు రాజ్ కోట టెస్ట్ రెండోరోజుఆటలోనే టీమిండియా పట్టు బిగించింది. తొలిఇన్నింగ్స్ లో 9 వికెట్లకు 649 పరుగుల భారీ స్కోరుతో డిక్లేర్ చేసిన టీమిండియా…సమాధానంగా విండీస్ ను తొలిఇన్నింగ్స్ లో 6 వికెట్లకు 94 పరుగులకే పరిమితం చేసింది. టీమిండియా ఫాస్ట్ బౌలర్ షమీ 2 వికెట్లు, స్పిన్నర్ల జడేజా, అశ్విన్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు. విండీస్ జట్టు టీమిండియా కంటే 555 […]

రాజ్‌కోట టెస్ట్ పై టీమిండియా పట్టు
X
  • ఇన్నింగ్స్ ఓటమి ప్రమాదంలో విండీస్
  • విండీస్ 94 పరుగులకే 6 వికెట్లు

రాజ్ కోట టెస్ట్ రెండోరోజుఆటలోనే టీమిండియా పట్టు బిగించింది. తొలిఇన్నింగ్స్ లో 9 వికెట్లకు 649 పరుగుల భారీ స్కోరుతో డిక్లేర్ చేసిన టీమిండియా…సమాధానంగా విండీస్ ను తొలిఇన్నింగ్స్ లో 6 వికెట్లకు 94 పరుగులకే పరిమితం చేసింది.

టీమిండియా ఫాస్ట్ బౌలర్ షమీ 2 వికెట్లు, స్పిన్నర్ల జడేజా, అశ్విన్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు. విండీస్ జట్టు టీమిండియా కంటే 555 పరుగులతో వెనుకబడి ఉంది.

సిరీస్ లోని ఈ తొలిటెస్ట్ మ్యాచ్ మొదటి నాలుగురోజుల్లోనే ముగిసే అవకాశాలున్నాయి. టీమిండియా ఇన్నింగ్స్ విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.

టీమిండియా భారీ స్కోరు….

అంతకుముందు ఓవర్ నైట్ స్కోరుతో రెండోరోజు ఆట కొనసాగించిన టీమిండియా 9 వికెట్లకు 649 పరుగుల భారీస్కోరుతో డిక్లేర్ చేసింది. తొలిరోజుఆటలో టీమిండియాయువ ఓపెనర్ పృథ్వీ షా స్ట్రోక్ ఫుల్ సెంచరీ సాధిస్తే….రెండోరోజు ఆటలో కెప్టెన్ విరాట్ కొహ్లీ 139 పరుగులు, రవీంద్ర జడేజా 100 పరుగులతో సెంచరీలు సాధించారు.

వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషభ్ పంత్ సెంచరీకి ఎనిమిది పరుగుల దూరంలో అవుటయ్యాడు. విండీస్ బౌలర్లలో లెగ్ స్పిన్నర్ దేవేంద్ర బిషు 4 వికెట్లు, ఫాస్ట్ బౌలర్ లూయిస్ 2 వికెట్లు పడగొట్టారు.

కొహ్లీ వెయ్యి పరుగుల హ్యాట్రిక్….

విండీస్ తో తొలి టెస్ట్ తొలిరోజు ఆటలో 72 పరుగుల నాటౌట్ స్కోరుతో నిలిచిన విరాట్ కొహ్లీ… రెండోరోజుఆటలోనూ అదేజోరు కొనసాగించాడు. ఏకంగా 139 పరుగులు సాధించడం ద్వారా.… వెయ్యి పరుగుల మైలురాయిని వరుసగా మూడో ఏడాది చేరాడు.

2016, 2017 సీజన్లలో వెయ్యి పరుగులు చొప్పున సాధించిన విరాట్ కొహ్లీ…2018 సీజన్లో సైతం వెయ్యి పరుగులు చేయడం ద్వారా హ్యాట్రిక్ పూర్తి చేశాడు. భారత క్రికెట్ చరిత్రలోనే …టెస్ట్ క్రికెట్లో వరుసగా మూడేళ్లు వెయ్యి పరుగులు సాధించిన ఒకే ఒక్క క్రికెటర్ విరాట్ కొహ్లీ మాత్రమే.

37 టెస్టుల తర్వాత జడేజా శతకం….

సౌరాష్ట్ర చిరుత, టీమిండియా స్పిన్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా….టెస్ట్ క్రికెట్లో ఎట్టకేలకు తన తొలి సెంచరీ సాధించాడు.

హోంగ్రౌండ్ సౌరాష్ట్ర క్రికెట్ స్టేడియం వేదికగా విండీస్ తో జరుగుతున్న తొలిటెస్ట్ రెండోరోజుఆటలో జడేజా ధూమ్ ధామ్ సెంచరీ బాదాడు. కేవలం 132 బాల్స్ లోనే 5 బౌండ్రీలు, 5 సిక్సర్లతో వంద పరుగుల స్కోరు సాధించి అజేయంగా నిలిచాడు.

2012లో నాగపూర్ విదర్భ స్టేడియం వేదికగా ఇంగ్లండ్ పై టెస్ట్ అరంగేట్రం చేసిన జడేజా…తొలి శతకం సాధించడానికి 38 టెస్టులపాటు ఎదురుచూడాల్సి వచ్చింది.

ప్రస్తుత రాజ్ కోట్ టెస్ట్ కు ముందు వరకూ ఆడిన 37 టెస్టుల్లో 9 హాఫ్ సెంచరీలు సాధించిన జడేజా…38వ టెస్టులో మూడంకెల స్కోరు అందుకొన్నాడు.

జడేజా మెరుపు సెంచరీతో…టీమిండియా 9 వికెట్లకు 649 పరుగుల భారీస్కోరు సాధించగలిగింది.

First Published:  5 Oct 2018 5:45 PM IST
Next Story