బ్రిడ్జి కెపాసిటి సరిపోదనే కవాతు వాయిదా " జనసేన
ఈనెల 9న జనసేన నిర్వహించాలనుకున్న కవాతు కార్యక్రమం వాయిదా పడింది. కొవ్వూరు నుంచి రాజమండ్రి వరకు ఈ కవాతును నిర్వహించాలని తొలుత భావించారు. అయితే కార్యక్రమాన్ని వాయిదా వేసినట్టు జనసేన ప్రకటించింది. కవాతు తిరిగి ఎప్పుడు ఉంటుందన్నది నిర్ణయించబోతున్నారు. తక్కువ సమయం, సాంకేతిక కారణాల వల్లే కవాతును వాయిదా వేసినట్టు జనసేన ప్రకటించింది. జనసేన కవాతుకు కొవ్వూరు రోడ్ కం రైలు బ్రిడ్జి కెపాసిటీ సరిపోదని అందుకే కవాతును వాయిదా వేసినట్టు జనసేన మీడియా వెల్లడించింది. బ్రిడ్జి […]

ఈనెల 9న జనసేన నిర్వహించాలనుకున్న కవాతు కార్యక్రమం వాయిదా పడింది. కొవ్వూరు నుంచి రాజమండ్రి వరకు ఈ కవాతును నిర్వహించాలని తొలుత భావించారు. అయితే కార్యక్రమాన్ని వాయిదా వేసినట్టు జనసేన ప్రకటించింది. కవాతు తిరిగి ఎప్పుడు ఉంటుందన్నది నిర్ణయించబోతున్నారు.
తక్కువ సమయం, సాంకేతిక కారణాల వల్లే కవాతును వాయిదా వేసినట్టు జనసేన ప్రకటించింది. జనసేన కవాతుకు కొవ్వూరు రోడ్ కం రైలు బ్రిడ్జి కెపాసిటీ సరిపోదని అందుకే కవాతును వాయిదా వేసినట్టు జనసేన మీడియా వెల్లడించింది. బ్రిడ్జి కెపాసిటీని దృష్టిలో ఉంచుకుని కవాతు వద్దని నిపుణులు సూచించడంతో పవన్ అందుకు అంగీకరించారని ఆ పార్టీ వివరించింది. కవాతు రూట్‌ను మార్చే అవకాశం ఉందని వెల్లడించింది.