Telugu Global
Cinema & Entertainment

అరవింద సమేతకు ఇంత క్రేజ్ ఉందా..?

కొన్ని సార్లు సోషల్ మీడియా ట్రెండ్స్ చూస్తే ఈ సినిమాకు ఇంత సీన్ ఉందా అనిపిస్తుంటుంది. కాంబినేషన్ క్రేజీ కావొచ్చు కానీ మరీ ఇంత సంచలనం అయితే ఎవరూ ఊహించి ఉండరు. అరవింద సమేత చిత్రానికి సంబంధించి ప్రస్తుతం ఇదే ట్రెండ్ నడుస్తోంది. రీసెంట్ గా ఈ సినిమా ట్రయిలర్ ను విడుదల చేశారు. విడుదల చేసినప్పట్నుంచి ఈ క్షణం వరకు యూట్యూబ్ లో ఇది ఇంకా నంబర్ వన్ స్థానంలోనే కొనసాగడం విశేషం. 24 గంటలు […]

అరవింద సమేతకు ఇంత క్రేజ్ ఉందా..?
X

కొన్ని సార్లు సోషల్ మీడియా ట్రెండ్స్ చూస్తే ఈ సినిమాకు ఇంత సీన్ ఉందా అనిపిస్తుంటుంది. కాంబినేషన్ క్రేజీ కావొచ్చు కానీ మరీ ఇంత సంచలనం అయితే ఎవరూ ఊహించి ఉండరు. అరవింద సమేత చిత్రానికి సంబంధించి ప్రస్తుతం ఇదే ట్రెండ్ నడుస్తోంది. రీసెంట్ గా ఈ సినిమా ట్రయిలర్ ను విడుదల చేశారు. విడుదల చేసినప్పట్నుంచి ఈ క్షణం వరకు యూట్యూబ్ లో ఇది ఇంకా నంబర్ వన్ స్థానంలోనే కొనసాగడం విశేషం.

24 గంటలు గడిచేసరికి ఈ సినిమాకు ఏకంగా 94లక్షల వ్యూస్ వచ్చాయి. మరికొన్ని గంటల్లో ఇది ఏకంగా కోటి వ్యూస్ సంపాదించడం ఖాయం. సోషల్ మీడియాలో ఈ ట్రయిలర్ కు ఇంత రెస్పాన్స్ వస్తుందని ఎవరూ ఊహించలేదు. చివరికి మేకర్స్ కూడా. బాహుబలి-2 ట్రయిలర్ తర్వాత అంత ప్రభంజనం మళ్లీ అరవింద సమేత ట్రయిలర్ తోనే చూస్తున్నాం.

ఈ ట్రయిలర్ కు ఇప్పటివరకు 3 లక్షల 50వేల కు పైగా లైక్స్ వచ్చాయి నిజానికి సోషల్ మీడియాలో పెయిడ్ యాక్టివిటీ ఎక్కువ. డబ్బులు పెడితే లైక్స్, వ్యూస్ విచ్చలవిడిగా వస్తాయి. కానీ అరవింద సమేత ట్రయిలర్ విషయంలో మాత్రం పెయిడ్ కంటే క్రేజ్ ఫ్యాక్టర్ ఎక్కువగా నడిచింది. అందుకే చిన్నపాటి పెయిడ్ బూస్టింగ్ కే సంచలనాలు సృష్టిస్తోంది ఈ ట్రయిలర్. ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా దసరా కానుకగా థియేటర్లలోకి రానుంది.

First Published:  4 Oct 2018 10:03 AM IST
Next Story