మాతో కెలుక్కున్నావ్.... ఇక జాగ్రత్త.... ఇప్పటికే దెబ్బకు ఎగిరి కరకట్టపై పడ్డావ్....
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి నిప్పులు చెరిగారు. నల్లగొండ జిల్లాలో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబుకు కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబు తమాషాలు చేస్తున్నారని…. ఇప్పటికే ఒకసారి తెలంగాణ దెబ్బ ఏంటో తగిలితే ఎగిరి విజయవాడ కరకట్ట మీద పడ్డారని కేసీఆర్ ఫైర్ అయ్యారు. మహాకూటమి అనేది ఒక విష కూటమి అన్నారు. మోడీ, కేసీఆర్ ఒకటయ్యారంటూ మాట్లాడుతున్న చంద్రబాబుకు సిగ్గుండాలి కదా అని ప్రశ్నించారు. నాలుగేళ్ల పాటు మోడీ సంకలో […]
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి నిప్పులు చెరిగారు. నల్లగొండ జిల్లాలో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబుకు కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబు తమాషాలు చేస్తున్నారని…. ఇప్పటికే ఒకసారి తెలంగాణ దెబ్బ ఏంటో తగిలితే ఎగిరి విజయవాడ కరకట్ట మీద పడ్డారని కేసీఆర్ ఫైర్ అయ్యారు.
మహాకూటమి అనేది ఒక విష కూటమి అన్నారు. మోడీ, కేసీఆర్ ఒకటయ్యారంటూ మాట్లాడుతున్న చంద్రబాబుకు సిగ్గుండాలి కదా అని ప్రశ్నించారు. నాలుగేళ్ల పాటు మోడీ సంకలో కూర్చుని…. మోడీ సంక నాకింది చంద్రబాబు కాదా? అని కేసీఆర్ ప్రశ్నించారు. మోడీని అడ్డుపెట్టుకునే కదా ఇంతకాలం హైకోర్టు విభజన జరగకుండా అడ్డుకున్నది అని నిలదీశారు.
”చంద్రబాబూ… మాతో కెలుక్కున్నావ్… ఇక జాగ్రత్త…. నేను మూడో కన్ను తెరిస్తే ఏమవుతావో ఆలోచించుకో” అని కేసీఆర్ హెచ్చరించారు. నీ రాష్ట్రంలోనూ 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయని…. వాటి సంగతి ముందు చూసుకో అని హితవు పలికారు. చంద్రబాబుకు అక్కడ దుకాణం సరిగా లేదన్నది అందరికీ తెలుసన్నారు కేసీఆర్.
చంద్రబాబు పేరు చెబితే తెలంగాణలో గేదెలు కూడా తాళ్లు తెంచుకుని పరుగులు తీస్తాయని కేసీఆర్ వ్యాఖ్యానించారు. అలాంటి చంద్రబాబుతో కాంగ్రెస్ వాళ్లు సిగ్గులేకుండా పొత్తుపెట్టుకున్నారని విరుచుకుపడ్డారు.
పొరపాటున కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తే అర్జీలు పట్టుకుని అమరావతికి వెళ్లాల్సి ఉంటుందని…. తెలంగాణ ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలన్నారు. రెండు డబ్బా కొట్టే మీడియా సంస్థలను అడ్డుపెట్టుకుని తాను ఏమి చేసినా చెల్లుతుందని చంద్రబాబు అనుకున్నారని కేసీఆర్ విరుచుకుపడ్డారు.