Telugu Global
International

రష్యాతో భారత్ డీల్.... అమెరికా వార్నింగ్

భారత్ మరో చారిత్రక ఒప్పందానికి మార్గం సుగమం చేసుకుంది.  భారత్ పర్యటనకు రష్యా అధ్యక్షుడు పుతిన్ వచ్చారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో భారత ప్రధాని మోడీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ ల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరుగనున్నాయి. ఇందులో రష్యా నుంచి పలు క్షిపణులు, యుద్ధ నౌకలు కొనుగోలు చేసేందుకు భారత్ నిర్ణయించినట్లు సమాచారం. భారత్-రష్యాల మధ్య 5 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదరబోతోంది. ఇందులో ఎస్-400 క్షిపణుల కొనుగోలుతో పాటు […]

రష్యాతో భారత్ డీల్.... అమెరికా వార్నింగ్
X

భారత్ మరో చారిత్రక ఒప్పందానికి మార్గం సుగమం చేసుకుంది. భారత్ పర్యటనకు రష్యా అధ్యక్షుడు పుతిన్ వచ్చారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో భారత ప్రధాని మోడీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ ల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరుగనున్నాయి. ఇందులో రష్యా నుంచి పలు క్షిపణులు, యుద్ధ నౌకలు కొనుగోలు చేసేందుకు భారత్ నిర్ణయించినట్లు సమాచారం.

భారత్-రష్యాల మధ్య 5 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదరబోతోంది. ఇందులో ఎస్-400 క్షిపణుల కొనుగోలుతో పాటు నాలుగు క్రివాక్ యుద్ధనౌకలను కొనుగోలు చేసేందుకు నిర్ణయించారు. ఈ యుద్ధ నౌకలకే 2.5 బిలియన్ డాలర్లు వెచ్చించనున్నారు.

భారత్-రష్యా రక్షణ ఒప్పందంపై అమెరికా కన్నెర్ర చేసింది. రష్యా నుంచి ఎస్-400 సర్ఫేస్ టు ఎయిర్ మిస్సెల్ కొనుగోలు చేయవద్దని భారత్ పై అమెరికా కొద్దిరోజులుగా ఒత్తిడి తెస్తోంది. కానీ అమెరికా హెచ్చరికలను బేఖాతరు చేస్తూ భారత్ పర్యటనకు వస్తున్న రష్యా అధ్యక్షుడితో ఒప్పందం చేసుకునేందుకు భారత్ సిద్ధమైంది. ఒకవేళ భారత్ గనుక ఆ క్షిపణులను కొనుగోలు చేస్తే అమెరికా చట్టాల ప్రకారం ఆంక్షలు విధిస్తామని అమెరికా ప్రభుత్వం హెచ్చరించింది.

చైనా, పాకిస్తాన్ దూకుడుకు అడ్డుకట్ట వేయడానికి భారత్ ఈ ఎస్-400 క్షిపణులను రష్యా నుంచి కొనేందుకు ఒప్పందం చేసుకుంటోంది. ఇదే క్షిపణిని రష్యా నుంచి కొనుగోలు చేసేందుకు చైనా ప్రయత్నించగా.. అమెరికా డ్రాగన్ దేశంపై కూడా ఆంక్షలు విధించింది. ఇప్పుడు భారత్ విషయంలోనూ అమెరికా అదే వైఖరి అవలంభిస్తోంది.

First Published:  4 Oct 2018 12:30 PM IST
Next Story