ఏపీలో కాంగ్రెస్‌తో పొత్తు లేదా?
రాజకీయాల్లో అవసరాలే ఉంటాయి.. అధికారం కోసం కుప్పిగంతులు ఎన్నైనా చేస్తారు. అవసరార్థం గొంగళి పురుగునైనా ముద్దు పెట్టుకుంటానని అప్పట్లో కేసీఆర్ అన్నారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు ఉండరని కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని చంద్రబాబు నిరూపించారు. ఇలా రాజకీయాల్లో ఎవరి అవసరార్థం వారు రంగులు మారుస్తూనే ఉంటారు. చంద్రబాబు తాజాగా తను దోస్తీ చేద్దామన్నా కేసీఆర్ ముందుకు రాలేదని.. వెనుక మోడీ ఉన్నాడని ఆడిపోసుకున్నాడు. కేసీఆర్ ఏమో నిన్నటి సభలో చంద్రబాబు కూటమి పెట్టి […]
రాజకీయాల్లో అవసరాలే ఉంటాయి.. అధికారం కోసం కుప్పిగంతులు ఎన్నైనా చేస్తారు. అవసరార్థం గొంగళి పురుగునైనా ముద్దు పెట్టుకుంటానని అప్పట్లో కేసీఆర్ అన్నారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు ఉండరని కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని చంద్రబాబు నిరూపించారు. ఇలా రాజకీయాల్లో ఎవరి అవసరార్థం వారు రంగులు మారుస్తూనే ఉంటారు.
చంద్రబాబు తాజాగా తను దోస్తీ చేద్దామన్నా కేసీఆర్ ముందుకు రాలేదని.. వెనుక మోడీ ఉన్నాడని ఆడిపోసుకున్నాడు. కేసీఆర్ ఏమో నిన్నటి సభలో చంద్రబాబు కూటమి పెట్టి తెలంగాణను మళ్లీ అల్లకల్లోలం చేయడానికి వస్తున్నాడని పరుష పదాలు వాడారు.
ఎవ్వరు ఏమన్నా కానీ ఇప్పుడు చంద్రబాబు – కాంగ్రెస్ దోస్తీ బలంగా ముందుకెళ్తోంది. అప్పట్లో కర్ణాటకలో జేడీఎస్ ప్రభుత్వానికి మద్దతుగా చంద్రబాబు వెళ్లినప్పుడే సోనియా-రాహుల్ తో సాన్నిహిత్యం పెంచుకున్నాడు. ఈసారి కనుక చంద్రబాబు గెలిస్తే ఖచ్చితంగా కేంద్రంలో కాంగ్రెస్ కే మద్దతిస్తారు. లోపాయికారిగా కాంగ్రెస్ తో చంద్రబాబు ఒప్పందం కుదుర్చుకున్నాడని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. బీజేపీతో పూర్తిగా కటీఫ్ చేసుకున్న బాబు ఇప్పుడు తన పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన కాంగ్రెస్ తో కలిసి నడవడమే పెద్ద వైచిత్యం అనడంలో ఎలాంటి సందేహం లేదు.
అయితే కాంగ్రెస్ తో స్నేహాన్ని ఏపీ బయట మాత్రమే కొనసాగించి లబ్ధి పొందాలని బాబు స్కెచ్ గీశాడు. ఏపీ లోపల అయితే జనాలు తనను బొంద పెడతారని తెలుసు. అందుకే ఇప్పుడు తెలంగాణలో మహాకూటమి పేరుతో కాంగ్రెస్ తో జట్టుకట్టిన బాబు.. ఏపీలో మాత్రం ఆ ధైర్యం చేయడం లేదు. దీనికి బలాన్నిచ్చేలా తాజాగా వైఎస్ఆర్ కడప జిల్లా పొద్దుటూరులో ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి హాట్ కామెంట్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్-టీడీపీ పొత్తు పెట్టుకొని ముందుకెళ్తున్నాయని.. ఏపీలో మాత్రం టీడీపీతో పొత్తు ఆలోచనలే లేవని స్పష్టం చేశారు.
దీన్ని బట్టి చంద్రబాబు క్లారిటీగా ఉన్నారు. ఏపీలో ఆది నుంచి వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ తో తెలుగుదేశం కలవడం లేదు. ఏపీ విడిపోయి అష్టకష్టాలు పడడానికి కారణమైన కాంగ్రెస్ తో కలిస్తే తన పుట్టి మునుగుతుందని చంద్రబాబుకు తెలుసు. అందుకే తన పొత్తు రాజకీయాల నుంచి ఏపీని మినహాయించి ఏపీ బయట మాత్రమే చెలిమి చేసేలా స్కెచ్ గీశారని అర్థమవుతోంది.