Telugu Global
Cinema & Entertainment

స్టేజి మీదే వెక్కి వెక్కి ఏడ్చిన ఎన్టీఆర్

జూనియర్ ఎన్టీఆర్ తండ్రి అలాగే సీనియర్ హీరో అయిన హరికృష్ణ ఇటివలే రోడ్ ప్రమాదంలో మృతి చెందిన సంగతి అందరికి తెలిసిందే. ఆ ఇన్సిడెంట్ తరువాత ఎన్టీఆర్ ఇప్పటి వరకు ఏ ఒక్క పబ్లిక్ మీటింగ్ కూడా అటెండ్ అవ్వలేదు. అయితే నిన్న జరిగిన “అరవింద సమేత” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తొలిసారి అందరి ముందు మాట్లాడాడు. తన 27 సినిమాల్లో ఏ దర్శకుడు కూడా తండ్రి చితికి నిప్పు పెట్టే సీన్ పెట్టలేదని, కానీ […]

స్టేజి మీదే వెక్కి వెక్కి ఏడ్చిన ఎన్టీఆర్
X

జూనియర్ ఎన్టీఆర్ తండ్రి అలాగే సీనియర్ హీరో అయిన హరికృష్ణ ఇటివలే రోడ్ ప్రమాదంలో మృతి చెందిన సంగతి అందరికి తెలిసిందే. ఆ ఇన్సిడెంట్ తరువాత ఎన్టీఆర్ ఇప్పటి వరకు ఏ ఒక్క పబ్లిక్ మీటింగ్ కూడా అటెండ్ అవ్వలేదు.

అయితే నిన్న జరిగిన “అరవింద సమేత” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తొలిసారి అందరి ముందు మాట్లాడాడు. తన 27 సినిమాల్లో ఏ దర్శకుడు కూడా తండ్రి చితికి నిప్పు పెట్టే సీన్ పెట్టలేదని, కానీ ఇందులో త్రివిక్రమ్ ఆ సీన్ పెట్టాడని చెప్పాడు ఎన్టీఆర్. ఈ విషయం చెబుతూ అలాగే తండ్రి గురించి గుర్తు చేసుకుంటూ వెక్కి వెక్కి ఏడ్చేశాడు ఎన్టీఆర్. 20 నిమిషాలకు పైగా సాగిన ఎన్టీఆర్ స్పీచ్ లో చాలా విషయాలను చెప్పాడు ఎన్టీఆర్.

ముఖ్యంగా తండ్రి గురించి చెబుతూ అయన ఎప్పుడు అభిమానులే ప్రాణంగా ఉన్నారని, వారిని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పినట్లు గుర్తుచేసుకున్నారు. తానూ ప్రాణం ఉన్నంతవరకు కూడా అదే చేస్తానని చెప్పాడు ఎన్టీఆర్.నిజంగా తండ్రిని తలుచుకొని ఎన్టీఆర్ చిన్న పిల్లాడిలా ఏడ్చేశాడు. ఓ మనిషి ఉన్నప్పుడు కంటే కూడా లేనప్పుడే అయన విలువ తెలుస్తుంది అంటే ఏమో అనుకున్నాం కానీ, ఇప్పుడు తెలుస్తుంది. ఎన్టీఆర్ స్పీచ్ చూసిన వారంతా చలించిపోయారు.

First Published:  3 Oct 2018 5:16 AM IST
Next Story