Telugu Global
NEWS

సీఎం రమేష్ తండ్రి హత్యకేసులో జైలుకు వెళ్లింది నిజం కాదా?

ప్రొద్దుటూరు టీడీపీ రోడ్డున పడింది. మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి, ఎంపీ సీఎం రమేష్ వర్గీయులుగా ప్రొద్దుటూరు టీడీపీ చీలిపోయింది. మున్పిపాలిటీలో వరదరాజుల రెడ్డి హవా చెలాయిస్తున్నంటూ సీఎం రమేష్‌ వర్గీయులుగా ఉన్న 22 మంది కౌన్సిలర్లు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో వరదరాజుల రెడ్డి తీవ్రంగా స్పందించారు. ప్రొద్దుటూరు టీడీపీలో అల్లర్ల వెనుక సీఎం రమేష్‌ హస్తముందని ఆరోపించారు. మీడియాను మొత్తం మేనేజ్ చేసి కథ నడుపుతున్నారని మండిపడ్డారు. సీఎం రమేష్‌ను ప్రొద్దుటూరు రాజకీయాల్లోకి అడుగుపెట్టనివ్వబోనని వరదరాజులరెడ్డి […]

సీఎం రమేష్ తండ్రి హత్యకేసులో జైలుకు వెళ్లింది నిజం కాదా?
X

ప్రొద్దుటూరు టీడీపీ రోడ్డున పడింది. మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి, ఎంపీ సీఎం రమేష్ వర్గీయులుగా ప్రొద్దుటూరు టీడీపీ చీలిపోయింది. మున్పిపాలిటీలో వరదరాజుల రెడ్డి హవా చెలాయిస్తున్నంటూ సీఎం రమేష్‌ వర్గీయులుగా ఉన్న 22 మంది కౌన్సిలర్లు రాజీనామా చేశారు.

ఈ నేపథ్యంలో వరదరాజుల రెడ్డి తీవ్రంగా స్పందించారు. ప్రొద్దుటూరు టీడీపీలో అల్లర్ల వెనుక సీఎం రమేష్‌ హస్తముందని ఆరోపించారు. మీడియాను మొత్తం మేనేజ్ చేసి కథ నడుపుతున్నారని మండిపడ్డారు. సీఎం రమేష్‌ను ప్రొద్దుటూరు రాజకీయాల్లోకి అడుగుపెట్టనివ్వబోనని వరదరాజులరెడ్డి స్పష్టం చేశారు. మున్పిపల్ ఎన్నికల్లో చాలా మంది కౌన్సిలర్లను తన డబ్బుతో గెలిపించానని చెప్పారు.

అలాంటి వారిని కూడా సీఎం రమేష్ కొనేశారని ఆరోపించారు. నగరంలో ఏ అభివృద్ధి చేద్దామన్నా సీఎం రమేష్ వర్గం అడ్డుపడుతోందన్నారు. సీఎం రమేష్‌ కుటుంబానికే నేర చరిత్ర ఉందన్నారు. సీఎం రమేష్ తండ్రి హత్యకేసులో జైలుకు వెళ్లింది నిజం కాదా అని ప్రశ్నించారు.

సుప్రీం కోర్టు కూడా సీఎం రమేష్‌ తండ్రికి శిక్షను ఖాయం చేసిందని చెప్పారు. కానీ అప్పట్లో కాంగ్రెస్‌ ముఖ్యమంత్రిగా ఉన్న వెంగళ్‌ రావు వద్దకు వెళ్లి మీరు వెలమే.. మేము వెలమే అని కులం చూపించి కేసు నుంచి సీఎం రమేష్‌ తండ్రి బయటకు వచ్చారని వరదరాజుల రెడ్డి వివరించారు.

First Published:  2 Oct 2018 1:35 PM IST
Next Story