నల్లమందును చట్టబద్ధం చేయాలంటున్న సిద్ధూ
పిచ్చి కుదిరింది తలకు రోకలి చుట్టమన్నాడట వెనకటికొకడు. కాంగ్రెస్ నాయకుడు, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ పరిస్థితి ఇపుడు ఇలాగే ఉంది. నల్లమందును చట్టబద్ధం చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. పంజాబ్‌లో మాదకద్రవ్యాలపై నిషేధం ఉంది. అయితే వాటిని సాగు చేసుకునేందుకు అనుమతివ్వాలని సిద్ధూ డిమాండ్ చేస్తున్నారు. నల్లమందు సాగు చేయడాన్ని చట్టబద్ధం చేయాలని సిద్ధూ కోరుతుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే సిద్ధూ మాత్రం అవేవీ లెక్క చేయడం లేదు. హెరాయిన్ కంటే నల్లమందు బెటరేనని […]
పిచ్చి కుదిరింది తలకు రోకలి చుట్టమన్నాడట వెనకటికొకడు. కాంగ్రెస్ నాయకుడు, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ పరిస్థితి ఇపుడు ఇలాగే ఉంది. నల్లమందును చట్టబద్ధం చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.
పంజాబ్‌లో మాదకద్రవ్యాలపై నిషేధం ఉంది. అయితే వాటిని సాగు చేసుకునేందుకు అనుమతివ్వాలని సిద్ధూ డిమాండ్ చేస్తున్నారు. నల్లమందు సాగు చేయడాన్ని చట్టబద్ధం చేయాలని సిద్ధూ కోరుతుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే సిద్ధూ మాత్రం అవేవీ లెక్క చేయడం లేదు. హెరాయిన్ కంటే నల్లమందు బెటరేనని వాదిస్తున్నారు.
డీజీపీ సురేష్ అరోరాతో కలిసి పాల్గొన్న ఓ కార్యక్రమంలో సిద్ధూ ఇలా మాట్లాడడం చూసి అంతా అవాక్కయ్యారు. పంజాబ్‌లో మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాటాన్ని కొనసాగిస్తామని, అది తమ అధికార యంత్రాంగం ప్రధాన కర్తవ్యమని ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తరచూ ప్రకటిస్తుంటారు.
పంజాబ్‌లోనే కాదు హర్యానా, హిమాచల్‌ప్రదేశ్, రాజస్థాన్‌లలో కూడా మాదకద్రవ్యాల విషయంలో కఠినంగా వ్యవహరించాలంటూ అమరీందర్‌సింగ్ తరచూ ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు విజ్ఞప్తి చేస్తుంటారు. కానీ ఇపుడు సిద్ధూ డిమాండ్ దానికి పూర్తి విరుద్ధంగా మారింది. దీంతో పంజాబ్‌లో కాంగ్రెస్ నాయకులు తలలు పట్టుకుని కూర్చున్నారు.