Telugu Global
National

గవర్నర్, ఎమ్మెల్యే మధ్య తీవ్ర వాగ్వాదం

పుదుచ్చేరి లెప్టినెంట్ గవర్నర్ కిరణ్‌ బేడీ వ్యవహార శైలిపై అక్కడి ప్రజాప్రతినిధులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఇప్పటికే ఆమెపై పలుమార్లు ముఖ్యమంత్రి నారాయణస్వామి, కాంగ్రెస్‌ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆమె లెప్టినెంట్ గవర్నర్‌లా కాకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని స్తంభింప చేయడానికి వచ్చిన వ్యక్తిలా ప్రవర్తిస్తున్నారని గతంలో పలుమార్లు ఆరోపణలు వచ్చాయి. ప్రజల చేత ఎన్నికైన ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం కంటే తానే శక్తివంతమైన వ్యక్తిని అన్నట్టుగా ఆమె తీరు ఉంటోందన్న విమర్శ ఉంది. తాజాగా గాంధీ జయంతి […]

గవర్నర్, ఎమ్మెల్యే మధ్య తీవ్ర వాగ్వాదం
X

పుదుచ్చేరి లెప్టినెంట్ గవర్నర్ కిరణ్‌ బేడీ వ్యవహార శైలిపై అక్కడి ప్రజాప్రతినిధులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఇప్పటికే ఆమెపై పలుమార్లు ముఖ్యమంత్రి నారాయణస్వామి, కాంగ్రెస్‌ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేశాయి.

ఆమె లెప్టినెంట్ గవర్నర్‌లా కాకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని స్తంభింప చేయడానికి వచ్చిన వ్యక్తిలా ప్రవర్తిస్తున్నారని గతంలో పలుమార్లు ఆరోపణలు వచ్చాయి. ప్రజల చేత ఎన్నికైన ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం కంటే తానే శక్తివంతమైన వ్యక్తిని అన్నట్టుగా ఆమె తీరు ఉంటోందన్న విమర్శ ఉంది. తాజాగా గాంధీ జయంతి సందర్భంగా వేదికపైనే కిరణ్ బేడీ, ఏఐఏడీఎంకే ఎమ్మెల్యే అంబలగన్‌ మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది.

వేదికపై ప్రసంగించిన ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగడం లేదని…. కిరణ్ బేడీ వల్లే ఈ పరిస్థితి వచ్చిందని వాపోయారు. ఆమెపై మరిన్ని విమర్శలు చేస్తుండగా… వెంటనే మైక్ కట్ చేయాలని కిరణ్ బేడీ అధికారులను ఆదేశించారు. దాన్ని అవమానంగా భావించిన ఎమ్మెల్యే వేదికపైనే కిరణ్ బేడీతో వాగ్వాదానికి దిగారు.

గట్టిగా అరుస్తూ ఆమె తీరును ఎండగట్టారు. ఎందుకు అంత అహంకారం అని ప్రశ్నించారు. వెంటనే వేదిక దిగి వెళ్లిపోవాల్సిందిగా కిరణ్ బేడీ ఆదేశించడంతో ఎమ్మెల్యే మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరే వేదిక దిగి వెళ్లిపోండి అంటూ ఆమెకు సూచించారు. వేదికపై ఉన్న ఇతర నేతలు చాలా సేపటి వరకు జోక్యం చేసుకోలేదు. చివరకు అక్కడున్న వారంతా సర్దిచెప్పడంతో కిరణ్‌ బేడీ తీరును విమర్శిస్తూనే ఎమ్మెల్యే వేదిక దిగి వెళ్లిపోయారు.

First Published:  2 Oct 2018 12:12 PM IST
Next Story