Telugu Global
National

 హిమ దాస్.... ఇక గ్రేడ్-1 ఆఫీసర్

ఆసియా క్రీడల్లో మూడు పతకాల విజేత హిమ దాస్ హిమ దాస్ కు అసోం ప్రభుత్వం 3 కోట్ల రూపాయల నజరానా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో ఉద్యోగం… మహిళల 400 మీటర్ల పరుగులో భారత సంచలనం, అసోం ఎక్స్ ప్రెస్ హిమ దాస్ ను… ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో గ్రేడ్-ఏ ఉద్యోగం వరించింది. ప్రపంచ జూనియర్ అథ్లెటిక్స్ లో బంగారు పతకం సాధించడం ద్వారా ప్రపంచ దృష్టిని ఆకర్షించిన హిమ దాస్… జకార్తాలో ఇటీవలే ముగిసిన ఆసియాక్రీడల […]

 హిమ దాస్.... ఇక గ్రేడ్-1 ఆఫీసర్
X
  • ఆసియా క్రీడల్లో మూడు పతకాల విజేత హిమ దాస్
  • హిమ దాస్ కు అసోం ప్రభుత్వం 3 కోట్ల రూపాయల నజరానా
  • ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో ఉద్యోగం…

మహిళల 400 మీటర్ల పరుగులో భారత సంచలనం, అసోం ఎక్స్ ప్రెస్ హిమ దాస్ ను… ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో గ్రేడ్-ఏ ఉద్యోగం వరించింది.

ప్రపంచ జూనియర్ అథ్లెటిక్స్ లో బంగారు పతకం సాధించడం ద్వారా ప్రపంచ దృష్టిని ఆకర్షించిన హిమ దాస్… జకార్తాలో ఇటీవలే ముగిసిన ఆసియాక్రీడల పరుగు అంశాలలో రెండు స్వర్ణాలు, ఓ రజత పతకం సాధించడం ద్వారా సరికొత్త రికార్డు నెలకొల్పింది.

అసోం ప్రభుత్వం, కేంద్రప్రభుత్వం కోట్ల రూపాయలు నజరానాగా ఇచ్చి హిమ దాస్ ను ప్రోత్సహించాయి. అంతేకాదు… విఖ్యాత స్పోర్ట్స్ గూడ్స్ సంస్థ… అడిడాస్ సైతం బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది.

అంతేకాదు… ప్రభుత్వరంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థ సైతం… గౌహతీ కేంద్రంగా… గ్రేడ్-1 ఉద్యోగం ఇచ్చి వెన్నుతట్టింది.

అంతేకాదు… హిమ దాస్ కు అత్యాధునిక శిక్షణ సదుపాయాలు, ప్రపంచ పోటీలలో పాల్గొనటానికి అవసరమైన సదుపాయాలను సైతం… ఇండియన్ ఆయిల్ సంస్థే కల్పిస్తుంది. 18 సంవత్సరాల హిమ దాస్ … ఇటీవలే అర్జున అవార్డును సైతం అందుకొన్న సంగతి తెలిసిందే.

First Published:  2 Oct 2018 12:15 PM IST
Next Story