"అరవింద సమేత" ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ ?
ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా “అరవింద సమేత వీర రాఘవ”. పూర్తీ స్థాయి ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై అందరిలోనూ భారి అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా డ్యూయల్ రోల్ లో నటిస్తున్నట్టు తెలుస్తుంది. రాయలసీమ ఫ్యాక్షనిజానికి బలైన తండ్రి పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం పెనీవిటి అనే పాటని ఎన్టీఆర్, ఈషా రెబ్బా పైన చిత్రీకరిస్తున్నారు […]
ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా “అరవింద సమేత వీర రాఘవ”. పూర్తీ స్థాయి ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై అందరిలోనూ భారి అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా డ్యూయల్ రోల్ లో నటిస్తున్నట్టు తెలుస్తుంది. రాయలసీమ ఫ్యాక్షనిజానికి బలైన తండ్రి పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం పెనీవిటి అనే పాటని ఎన్టీఆర్, ఈషా రెబ్బా పైన చిత్రీకరిస్తున్నారు మూవీ యూనిట్.
గుండెల్ని పిండేసే ఈ పాట అరవింద సమేత లో హైలెట్ అవుతుందని , కన్నీళ్లు పెట్టించే పాట అవుతుంది అని అంటున్నారు ఫిలిం నగర్ జనాలు. ఒకరు తండ్రిగా మరొకరు కొడుకుగా తండ్రికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకునే వారసుడిగా ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయడం ఖాయమని టాక్. మరి ఈ న్యూస్ లో నిజం ఎంత ఉంది అనేది తెలియాలి అంటే అక్టోబర్ 11 వరకు ఆగాల్సిందే. పూజ హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి ఎస్.ఎస్ తమన్ సంగీతం అందించాడు.